Horoscope Today: వారికి వ్యాపారాల్లో లాభాలు పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి వ్యాపారాల్లో లాభాలు పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (జూలై 4, 2025): మేష రాశి వారికి ఈ రోజంతా చాలావరకు హ్యాపీగా, సాఫీగా గడిచిపోయే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా చాలావరకు హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగి పోతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయానికి లోటు లేనప్ప టికీ వృథా ఖర్చులు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధపెట్టండి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా, సానుకూలంగా సాగి పోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా, సాఫీగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి. ఆస్తి వివాదం విషయంలో తోబుట్టువు లతో రాజీ మార్గం అనుసరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగు పనుల్ని పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బాగా ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొందరు బంధువుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్నవి అను కున్నట్టు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు, సహోద్యోగులు మీ మాటకు విలువని స్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. అయితే, అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. పిల్లలతో కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులుంటాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అలవికాని లక్ష్యాలతో, అదనపు బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. మిత్రులకు ఆర్థికంగా సహా యం చేస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా కొన సాగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రమ, తిప్పట ఉన్నప్ప టికీ, ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన కష్ట నష్టాల నుంచి, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఉన్న ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *