Home Loan: ఓ సామాన్య వ్యక్తి రూ. 50 లక్షల ఇంటిని కొనడం సాధ్యమేనా.? అసలు ఎంత జీతం సంపాదించాలంటే

Home Loan: ఓ సామాన్య వ్యక్తి రూ. 50 లక్షల ఇంటిని కొనడం సాధ్యమేనా.? అసలు ఎంత జీతం సంపాదించాలంటే


సాధారణంగా ఓ సామాన్య వ్యక్తికి ఇల్లు కొనడం అనేది తన జీవితకాలం కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఓ వ్యక్తి రూ. 80 వేలు ప్రతీ నెలా సంపాదిస్తుంటే.. అతడు రూ. 50 లక్షల ఇల్లు కొనుగోలు చేయగలడా.? హోం లోన్ ఈఎంఐ అనేది కచ్చితంగా జీతంలో 30 శాతం మించకూడదు. రూ. 40 లక్షల గృహ రుణానికి(రూ.50 లక్షల ఇంటిపై రూ. 10 లక్షల డౌన్‌పేమెంట్ తర్వాత) సుమారు రూ. 30,000 నుంచి రూ. 35,000 వరకు ఈఎంఐ అవుతుంది.

మరి ఇంతటి మొత్తాన్ని మనం హ్యాపీగా భరించాలంటే కచ్చితంగా నెల జీతం రూ. 1.20 లక్షలు ఉండాలి. రూ. 80 వేలు జీతం ఉన్న వ్యక్తి.. ఇంతటి స్థాయిలో ఇల్లు కొనాలంటే.. ఆర్ధిక ఒత్తిడి తప్పదు. ఇంటిని కొనుగోలు చేయాలనే తొందరలో లోన్స్ తీసుకోవద్దని.. 25 నుంచి 30 సంవత్సరాల పాటు రుణ భారం మోయడం కష్టంతో కూడుకున్న పని అని బిజినెస్ నిపుణులు అంటున్నారు. దీనికి బదులుగా పాసివ్ ఇన్‌కమ్‌పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఉదాహరణకు, రూ. 50 లక్షలను 1 శాతం వడ్డీకి పెట్టుబడి పెడితే నెలకు రూ. 50,000 పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. ఈ ఆదాయం ఇంటి ఈఎంఐ లేదా అద్దెను సులభంగా కవర్ చేస్తుంది. ఉద్యోగం కోల్పోయినా ఆర్థిక భద్రతను అందిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఆర్డీ లాంటి వాటిలో మొదటిగా ఎస్ఐపీలు స్టార్ట్ చేస్తే మంచిదని అంటున్నారు.

ఇది చదవండి: అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *