Hindu Belief: నుదిటిపై సింధూరం ధరిస్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Hindu Belief: నుదిటిపై సింధూరం ధరిస్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి


Hindu Belief: నుదిటిపై సింధూరం ధరిస్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

హిందూ మతంలో బొట్టు పెట్టుకోవడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. సనాతన సంప్రదాయంలో బొట్టు/సిందూరాన్ని స్త్రీ, పురుషులు ఇద్దరూ ధరించాలి. ఆలయం నుంచి తెచ్చిన కుంకుమ అయినా, నైవేద్యంగా సమర్పించిన సింధూరం అయినా, దాన్ని పెట్టుకునేటప్పుడు ఏ వేలు ఉపయోగిస్తున్నామన్నది చాలా ముఖ్యమని శాస్త్రాలు చెబుతాయి. సరైన ఆచారాలతో కుంకుమను ఉపయోగిస్తే సంబంధాలు మెరుగుపడతాయని, శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అందుకే కుంకుమను ఎల్లప్పుడూ కుడి చేతితోనే పెట్టుకోవాలని అంటారు. మన కుడి చేతిలోని ఐదు వేళ్లు ఐదు గ్రహాలకు ప్రతీకలుగా భావిస్తారు.

బొటనవేలు – శుక్రుడు
చూపుడు వేలు – బృహస్పతి
మధ్య వేలు – శని
ఉంగరపు వేలు – సూర్యుడు
చిటికెన వేలు – బుధుడు

ఈ గ్రహాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కుంకుమను నిర్దిష్ట వేలితో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటాయి. సాధారణంగా కుంకుమను పెట్టుకునేప్పుడు మధ్య వేలును ఉపయోగించాలని సూచిస్తారు. ఈ వేలు శని గ్రహానికి సంబంధించినది. దీని ద్వారా శని దోషం తగ్గి, ఆయుర్దాయం పెరుగుతుందని, ఆరోగ్య సమస్యలు తగ్గి ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని నమ్మకం. శని దీర్ఘాయువుకు కారకుడు కావడంతో, ఈ ఆచారం శ్రేయస్సుకు దారితీస్తుందని భావిస్తారు.

ఇక పెద్దలకు, అతిథులకు లేదా చిన్న పిల్లలకు కుంకుమ పెట్టేటప్పుడు బొటనవేలు ఉపయోగించాలి. బొటనవేలుతో కుంకుమ పెట్టడం వల్ల అనుబంధాలు బలపడతాయని, పరస్పర గౌరవం, ప్రేమ పెరుగుతాయని చెబుతారు.

దేవతల చిత్రాలు లేదా విగ్రహాలకు కుంకుమ పెట్టేటప్పుడు ఉంగరపు వేలును ఉపయోగించాలి. ఈ వేలు సూర్యునికి సంబంధించినది. గంధం పూసేటప్పుడు కూడా అదే వేలును ఉపయోగించడం శ్రేయస్కరం. అయితే ఒక ముఖ్యమైన నియమం ఉంది.. ముందుగా గంధం పూయాలి, తరువాత చేతులను శుభ్రంగా కడుక్కొని లేదా తుడిచిన తరువాత మాత్రమే కుంకుమ పూయాలి. గంధం, కుంకుమను కలిపి ఒకేసారి పెట్టరాదు.

సూర్యుని వేలితో విగ్రహాలను లేదా దేవతా చిత్రాలను తాకినప్పుడు శరీరం అంతటా సానుకూల కంపనాలు ప్రసరిస్తాయని విశ్వాసం. ఈ విధానాన్ని పురుషులు, మహిళలు ఇద్దరూ అనుసరించవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *