కేరళకు చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగులకు అదరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. కంపెనీలో పనిచేస్తున్న 47 మంది ఉద్యోగులకు ఏకంగా రూ.20కోట్ల విలువైన లగ్జరీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేసింది. కేరళ రాష్ట్రానికి చెందిన హైలైట్ గ్రూప్ అనే సంస్థం కంపెనీ ప్రారంభించిన 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏళ్ల తరబడి కంపెనీ అభివృద్ధికి కృషి చేసిన ఉద్యోగులకు ఈ కానుకలను ఇచ్చింది.
ఉద్యోగులకు కంపెనీ అదరిపోయే గిఫ్ట్
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని రిటైల్ స్పెస్ రంగంలో ఈ హైలైట్ గ్రూప్స్ అగ్ర స్థానంలో కొనసాగుతుంది. 1996లో స్థాపించిన ఈ కంపెనీల ఇటీవలే 30 ఏళ్లు పూరి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిరంతరాయంగా సంస్థకు సేవలు అందిస్తున్న సుమారు 47 మంది ఉద్యోగులకు కంపెనీ లగ్జరీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది.
ఇవి కూడా చదవండి
కంపెనీ ఇచ్చిన లగ్జరీ కార్లు ఇవే!
ఉద్యోగులకు కంపెనీ ఇచ్చిన కార్లలో రేంజ్ రోవర్, లాండ్ రోవర్ డిఫెండర్, టాటా హారియర్, ఆడీ క్యూ8, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ ఖరీఐన ఎస్యూవీ కార్లు ఉన్నాయి. కంపెనీ తమ పట్ల చూసించిన అభిమానినికి సదురు ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.