Hey Balwanth Review: హే బల్వంత్ మూవీ రివ్యూ.. సుహాస్ కామెడీతో నవ్వించాడా.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి..?

Hey Balwanth Review: హే బల్వంత్ మూవీ రివ్యూ.. సుహాస్ కామెడీతో నవ్వించాడా.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి..?


Hey Balwanth Review: హే బల్వంత్ మూవీ రివ్యూ.. సుహాస్ కామెడీతో నవ్వించాడా.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి..?

మూవీ రివ్యూ: హే బల్వంత్

నటీనటులు: సుహాస్, శివానీ నాగారం, వి.కె. నరేష్, స్రవంతి చొక్కారపు, వెన్నెల కిషోర్, సుదర్శన్, హర్షవర్ధన్, అజయ్ ఘోష్ తదితరులు

సంగీతం: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: మహీ రెడ్డి పండుగుల

ఎడిటింగ్: విప్లవ్ నైషధం

దర్శకత్వం: గోపీ అచ్చర

నిర్మాత: బి. నరేంద్ర రెడ్డి

సమర్పణ: బన్నీ వాస్, వంశీ నందిపాటి

కథ:

కృష్ణ (సుహాస్) ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. చిన్నపటి నుంచి తండ్రి చేసే బిజినెస్ టేకోవర్ చేసుకోవాలని కలలు కంటుంటాడు. మరోవైపు కృష్ణ తండ్రి రావు బల్వంత్ (వి.కె. నరేష్) లాడ్జి నడుపుతుంటాడు. ఓసారి కృష్ణ తండ్రికి హార్ట్ ఎటాక్ వస్తుంది. దాంతో డాక్టర్ బిజినెస్ టెన్షన్స్ కు దూరంగా ఉండమంటాడు. దాంతో తండ్రి చేసేది ఆ బిజినెస్‌ అని తెలియక ఎలాగైనా తన చేతుల్లోకి తీసుకుని, లాభాల బాట పట్టించాలని కృష్ణ నడుంబిగిస్తాడు. కానీ తీరా ఆ బాధ్యతలు తీసుకోడానికి అక్కడికి వెళ్లిన కృష్ణ.. అది లాడ్జ్ అని తెలిసి షాక్ అవుతాడు. ఈ గొడవల్లో మిత్ర (శివానీ నాగారం) పాత్ర ఏంటి..? అసలు ఎలాంటి పరిస్థితుల్లో రావు బల్వంత్ ఆ వ్యాపారం మొదలు పెట్టాడు అనేది మిగతా కథ.

కథనం:

ఒక రిస్కీ లైన్ తీసుకున్నప్పుడు సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంటుంది.. కానీ ఏదైనా తేడా జరిగితే డేంజర్ జోన్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. హే బల్వంత్ సినిమా ఈ రెండింటి మధ్య బాగా బ్యాలెన్స్ అయింది.. ఎలాంటి సినిమా చూడబోతున్నాం అనేది ఫస్ట్ 2 మినిట్స్ లోనే క్లారిటీ ఇచ్చేసాడు డైరెక్టర్. అక్కడ స్టోరీకి సింక్ అయితే సినిమా అంతా ట్రావెల్ అవ్వచ్చు. అప్పుడు డిస్కనెక్ట్ అయితే సినిమాను ఎంజాయ్ చేయడం కష్టం. ఒకరకంగా అడల్ట్ కామెడీ ఉంటుంది కానీ ఎక్కడ లైన్ మాత్రం దాటలేదు దర్శకుడు..
బిజినెస్ బిజినెస్ అంటూ టీజర్, ట్రైలర్లో హైప్ బాగా పెంచారు మేకర్స్. అదేంటో తెలిశాక.. దాని చుట్టూ అల్లుకున్న కామెడీ చాలా బాగా వర్క్ అయింది. ముఖ్యంగా ఫస్టాఫ్ హిలేరియస్.. ఎక్కడ చిన్న బ్రేక్ కూడా ఇవ్వలేదు. నాన్ స్టాప్ పంచులతో వెళ్లిపోయింది సినిమా.. మరీ ముఖ్యంగా సుదర్శన్ కామెడీ పీక్స్.

చాలా రోజుల తర్వాత బాబు మోహన్ కూడా కితకితలు పెట్టాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. అసలు కథలోకి వెళ్లడం వల్ల సెకండాఫ్ కాస్త స్లో అయింది. ఫ్లో దెబ్బ తినలేదు కానీ.. ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ అయితే లేదు. అందరూ హీరోలను కవర్ చేస్తూ సీనియర్ నరేష్ చేసిన సీన్ ఒకటి అదిరిపోయింది. క్లైమాక్స్ ఎమోషనల్ డోస్ బాగా పెంచేశారు. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. తండ్రి చేసే బిజినెస్ తెలియక.. కొడుకు ఇచ్చే బిల్డప్.. ఆ తర్వాత తెలిశాక దాని చుట్టూ అల్లుకున్న కామెడీ చాలా బాగా కుదిరింది. క్లైమాక్స్ లో కూడా నరేష్ ఎందుకు ఆ బిజినెస్ చేశాడు అనేదానికి ఆన్సర్ ఇచ్చాడు దర్శకుడు గోపి.

నటీనటులు:

సుహాస్ నాచురల్ గా ఉన్నాడు. తన మార్క్ న్యాచురల్ యాక్టింగ్‌తో కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. ఇది సుహాస్ 2.O వెర్షన్ అని ప్రమోషన్స్ లో చెప్పినట్లుగానే.. తన గత సినిమాల కంటే మరింత ఎనర్జిటిక్‌గా, ఫుల్ కమర్షియల్ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక తండ్రిగా సీనియర్ నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కామెడీ టైమింగ్, సెటైర్స్ సినిమాకు మేజర్ హైలైట్. సుహాస్-నరేష్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్‌లో మంచి నవ్వులు పూయిస్తాయి. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫేమ్ శివానీ నాగారం తన స్క్రీన్ ప్రెజెన్స్ తో బాగా ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, సుదర్శన్, అజయ్ ఘోష్ తమ కామెడీ ట్రాక్స్‌తో గట్టి సపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా సుదర్శన్ కామెడీ పీక్స్. యాంకర్ స్రవంతి బాగానే నటించింది. మిగిలిన వాళ్ళందరూ ఓకే..

టెక్నికల్ టీం:

వివేక్ సాగర్ మ్యూజిక్ సినిమాకు సోల్. తన మార్క్ సెన్సిబుల్ ట్యూన్స్, క్వైర్కీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సీన్స్‌ను ఎలివేట్ చేశాడు. మహీ రెడ్డి కెమెరా వర్క్ కలర్ ఫుల్‌గా ఉంది. ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో క్రిస్ప్‌గా ఉన్నా, సెకండాఫ్‌లో కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బన్నీ వాస్, వంశీ నందిపాటి లాంటి వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి కారణం ఈ క్వాలిటీనే అనిపిస్తుంది. డైరెక్టర్ గోపీ అచ్చర ఎంచుకున్న పాయింట్ సింపుల్ అయినా, దాన్ని ఫన్ అండ్ ఎమోషన్స్‌తో బ్యాలెన్స్ చేస్తూ తీసిన విధానం బాగుంది. ముఖ్యంగా తండ్రీకొడుకుల సెంటిమెంట్ బాగా రాసుకున్నాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా హే బల్వంత్.. ‘A’ డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *