Heroine: మూడేళ్లల్లో మూడు బ్లాక్ బస్టర్స్.. అమ్మాడి కోసం క్యూ కట్టిన దర్శకనిర్మాతలు.. ఎవరంటే..

Heroine: మూడేళ్లల్లో మూడు బ్లాక్ బస్టర్స్.. అమ్మాడి కోసం క్యూ కట్టిన దర్శకనిర్మాతలు.. ఎవరంటే..


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఆమె. 2022లో అమితాబ్ బచ్చన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ నటి.. గత 3 సంవత్సరాలలో వరుసగా మూడు బ్లాక్‌బస్టర్‌లను అందుకుంది. దీంతో వరుస హిట్లతో ఆమె బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాలీవుడ్‌లోని పెద్ద స్టార్లు హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆమె దీపికా పదుకొనే, అలియా భట్, నయనతారలను అధిగమించి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. అంతేకాదు.. అటు భారీ వసూళ్లతో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. సౌత్ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లకు టెన్షన్ పెడుతుంది. కానీ సల్మాన్ ఖాన్ తో ఆమె నటించిన ‘సికందర్’ సినిమా ఫ్లాప్ అయింది. ఆమె మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

రష్మిక మందన్న ‘గుడ్‌బై’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పరాజయం పాలైనప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం పెరిగిపోయింది. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘యానిమల్’ సినిమా ద్వారా ఆమె తొలి బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప 2’ సినిమాతో ఆమె తనదైన ముద్ర వేసింది. విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె నటించిన ‘ఛావా’ కూడా ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని భారతదేశపు నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్తాయిలో వసూల్లు రాబట్టాయి.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

భారీ బడ్జెట్ సినిమాలే కాదు.. చిన్న చిన్న చిత్రాలతోనూ హిట్స్ అందుకుంటుంది. ఇటీవలే కుబేర సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ప్రతి సినిమాలో తన పాత్రకు ప్రాణం పోస్తుంది. కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’లో అడుగుపెట్టడానికి ముందు, రష్మిక కొంతకాలం మోడలింగ్ చేసింది. తెలుగులో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది. ఇవి రాబోయే 2 సంవత్సరాలలో విడుదల కానున్నాయి.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *