Hero MotoCorp: హీరో మోటోకార్ప్ తన అత్యంత ప్రీమియం మోటార్‌సైకిల్ అయిన హీరో మావ్రిక్ 440 (Mavrick 440)ను అధికారికంగా నిలిపివేసింది. ఈ బైక్ 2024 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది హార్లే-డేవిడ్సన్ X440 ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేయబడిన నేక్డ్ స్ట్రీట్ బైక్. లాంచ్ సమయంలో ఇది చాలా అంచనాలు, హైప్‌తో ప్రవేశపెట్టంది. కానీ అమ్మకాల గణాంకాలు అంచనాలను అందుకోలేకపోయింది.
అమ్మకాలు తగ్గడం మూసివేతకు కారణం: ఇటీవలి నివేదికల ప్రకారం.. గత కొన్ని నెలలుగా మావ్రిక్ 440 డిజిటల్ లేదా ఆఫ్‌లైన్ అమ్మకాలు జరగలేదు. అందుకే కంపెనీ దానిని తన పోర్ట్‌ఫోలియో నుండి నిశ్శబ్దంగా తొలగించడం ప్రారంభించింది. ఈ బైక్‌ను హీరో వెబ్సైట్ నుండి ఇంకా పూర్తిగా తొలగించనప్పటికీ, దేశవ్యాప్తంగా చాలా మంది డీలర్లు దాని బుకింగ్‌లను తీసుకోవడం ఆపివేసారు.
హీరో మావ్రిక్ 440 ను హీరో మోటోకార్ప్ దాదాపు రూ. 2 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. దీనిని దాని అత్యంత ప్రీమియం బైక్‌గా అభివర్ణించారు. హార్లే-డేవిడ్సన్ X440 ఆధారంగా ఉన్న అదే ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిర్మించారు.
ఇంజిన్, సాంకేతిక లక్షణాలు: మావ్రిక్ 440 440cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడిచింది. ఇది 27 bhp శక్తిని, 36 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉంది. ఇది గేర్షిఫ్టింగ్ను సున్నితంగా, స్పోర్టీగా చేస్తుంది. ఈ బైక్ టార్క్ పనితీరు, రైడింగ్ సౌకర్యం కోసం రూపొందించారు.
ఆ ప్రయాణం 18 నెలల్లోనే ఎందుకు ముగిసింది? : ఈ నిర్ణయం బైక్ ప్రియులకు ఖచ్చితంగా కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏదైనా కొత్త ఉత్పత్తి మార్కెట్లో మనుగడ సాగించడానికి కనీసం 2-3 సంవత్సరాలు సమయం పడుతుంది. కానీ మావ్రిక్ 440ని కేవలం 18 నెలల్లోనే నిలిపివేయడం వల్ల మార్కెట్లో ఊహించినంత స్పందన రాలేదని సూచిస్తుంది. వినియోగదారులు బదులుగా హార్లే-డేవిడ్సన్ X440ని ఇష్టపడటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. రెండు బైక్‌లు ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకున్నప్పటికీ, హార్లే బ్రాండ్ విలువ, స్టైలింగ్ మరింత ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మావ్రిక్ విడుదల కావడంతో X440 అమ్మకాలు మరింత పెరగవచ్చు.