Health Tips: పంటి నొప్పి ఆ భయంకర వ్యాధికి సంకేతమా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Health Tips: పంటి నొప్పి ఆ భయంకర వ్యాధికి సంకేతమా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..


కొన్నిసార్లు దంతాలలో అకస్మాత్తుగా పదునైన నొప్పి వస్తుంది. సడెన్‌గా ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. చాలా సార్లు నొప్పి చల్లని లేదా తీపి ఆహారం తినడం వల్ల వచ్చిందేమో అనుకుంటాం. కానీ ఈ నొప్పి కూడా ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా నొప్పి పదేపదే వచ్చి, మందులు తీసుకున్న తర్వాత కూడా కొంత సమయం తగ్గకపోతే దీనిని లైట్ తీసుకోవద్దు. నిజానికి, మనం పంటి నొప్పిని చాలా తేలికగా తీసుకుంటాము. కానీ ఇది శరీరంలోని అనేక రకాల సమస్యలను సూచిస్తుంది. ఈ నొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రమైన రూపం దాలుస్తుంది. పంటి నొప్పికి కారణం ఏమిటి..? అది ఏ వ్యాధులను సూచిస్తుంది? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈ నొప్పి వెనుక అసలు కారణాలు

పంటి నొప్పికి అత్యంత సాధారణ కారణం దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం. మనం తీపి, జిగట లేదా ఆమ్ల పదార్థాలు తిన్నప్పుడల్లా దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోతే దంతాలు కుళ్ళిపోతాయి. దంత క్షయం ప్రారంభమవుతుంది. ఈ దంత క్షయం దంతాల పై పొరను బోలుగా చేస్తుంది. దీని కారణంగా దంత క్షయం దంతాల నరాలకు చేరి.. నొప్పిని కలిగిస్తుంది. చిగుళ్లలో వాపు ఉన్నప్పుడు, దంతాల పట్టును సడలించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా దంతాలు షివర్ అవుతుంటాయి. చాలా సార్లు, వాపుతో పాటు, చిగుళ్లలో చీము కూడా ఏర్పడుతుంది. చిగుళ్ల వాపు కూడా పంటి నొప్పికి ఒక సాధారణ సమస్య. మూడవ కారణం సరైన టూత్ బ్రష్‌ను ఉపయోగించకపోవడం. గట్టి ముళ్ళతో కూడిన బ్రష్‌తో దంతాలను శుభ్రం చేయడం, బ్రష్ చేసేటప్పుడు ఎక్కువ శక్తిని ప్రయోగించడం, దంతాలలో పగుళ్లు లేదా పదే పదే దంతాలను గ్రైండింగ్ చేసే అలవాటు వంటివి పంటి నొప్పికి కారణమవుతాయి.

పంటి నొప్పి దేనికి సంకేతం..?

దంత క్షయం కేవలం నోటి వ్యాధికి సంకేతం కాదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు ఇది గుండె జబ్బులు, సైనస్ ఇన్ఫెక్షన్ లేదా నాడీ సంబంధిత సమస్య యొక్క లక్షణం కూడా కావచ్చు. ఉదాహరణకు.. గుండెపోటుకు ముందు, కొంతమందికి దవడ, దంతాలలో నొప్పి వస్తుంది.

ఈ నొప్పిని ఎలా నివారించాలి..?

  • అతి ముఖ్యమైన మార్గం నోటి పరిశుభ్రతను సరిగ్గా చూసుకోవడం. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి. దంతాల మధ్య శుభ్రం చేయడానికి డెంటల్ ఫ్లాస్‌ను ఉపయోగించండి. తీపి లేదా జిగట ఆహారం తిన్న తర్వాత శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.
  • ఎటువంటి సమస్య లేకపోయినా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్యుడితో చెకప్ చేయించుకోండి. ఇది ఏదైనా వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తేనే పెద్ద సమస్య రాకుండా ఉంటుంది.
  • మీకు నిరంతర పంటి నొప్పి, చిగుళ్ళలో రక్తస్రావం వస్తుంటే దానిని విస్మరించవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
  • పంటి నొప్పి ఒక చిన్న లక్షణంగా అనిపించవచ్చు కానీ దాని వెనుక ఉన్న కారణం చాలా పెద్దది కావచ్చు. సమయానికి జాగ్రత్తగా ఉండండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్యులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *