Health Tips: ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. రోగాలను తరిమికొట్టే బ్రహ్మాస్త్రం.. ఉదయాన్నే ఇలా చేస్తే..

Health Tips: ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. రోగాలను తరిమికొట్టే బ్రహ్మాస్త్రం.. ఉదయాన్నే ఇలా చేస్తే..


Health Tips: ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. రోగాలను తరిమికొట్టే బ్రహ్మాస్త్రం.. ఉదయాన్నే ఇలా చేస్తే..

ప్రకృతి ఎన్నో సహజసిద్ధమైన, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధ మొక్కలను ప్రసాదించింది. వీటితో పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. అలాంటి ఔషధ మొక్కలలో వాము మొక్క ఒకటి.. వాము ఆకులలో ఎన్నో పోషకాలతో పాటు.. ఔషధ గుణాలు దాగున్నాయి. వాము ఆకులోని యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేయడంతోపాటు.. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను నియంత్రిస్తాయి.. అందుకే దీనిని పవర్‌ఫుల్ హెర్బల్ ప్లాంట్ అంటారు..

అయితే.. వాము ఆకులను పలు ప్రాంతాలలో పలు విధాలుగా పిలుస్తారు. స్థానికంగా “దగ్గాకు” లేదా “బజ్జీ ఆకు” అని కూడా పిలుస్తారు.. సంస్కృతంలో దీనిని కర్పూరవల్లి అని వ్యవహరిస్తారు. ఈ మొక్క అనేక ఔషధ, సుగంధ విలువలను కలిగి ఉంది. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది.. గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వాము ఆకులో విటమిన్ ఎ, సి, సెలీనియం, జింక్ వంటి కీలకమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీర జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

వాము ఆకులను సంప్రదాయకంగా కడుపు నొప్పి, అజీర్ణం, నెలసరి సమస్యలు, అతిసారం, బరువు తగ్గడం, పంటి నొప్పి, చనుబాలు పట్టడం, జలుబు వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు ఇంటి చిట్కాగా ఉపయోగిస్తారు. ఈ ఆకులు పొత్తికడుపు కండరాలను సడలించి, అపానవాయువు, మలబద్ధకం వంటి లక్షణాలను నివారిస్తాయి.

వామాకు బజ్జీలు..

వాము ఆకు కేవలం ఔషధ గుణాలను మాత్రమే కాకుండా, ఆహార పదార్థాలకు రుచిని అందించే సుగంధ మూలికగా కూడా ఉపయోగపడుతుంది. దీనిని బజ్జీలుగా, స్నాక్స్‌గా తీసుకోవచ్చు. సలాడ్లు, సూప్‌లలో చేర్చడం లేదా నేరుగా ఆకులను తినడం ద్వారా కూడా దీని ప్రయోజనాలను పొందవచ్చు. వాము ఆకు డికాక్షన్ లేదా హెర్బల్ టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.. ఉదయాన్నే తాగితే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

వాము ఆకు మొక్కలు సాధారణంగా రెండు రకాలుగా లభిస్తాయి: ఒకటి పెద్ద, ఆకుపచ్చని, మందపాటి ఆకులతో కూడిన రకం, మరొకటి అలంకరణ కోసం పెంచే వెరిగేటెడ్ రకం. ఈ రెండు రకాలూ ఔషధ ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. వాము ఆకు వంటి సుగంధ మూలికలు దోమలను నిరోధించే (మస్కిటో రెపల్లెంట్) గుణాలను కూడా కలిగి ఉంటాయి. వీటి సువాసన దోమలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇటువంటి ఔషధ మొక్కలను పెంచి, వాటి ప్రయోజనాలను అవగాహన చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని సహజ సిద్ధంగా కాపాడుకోవచ్చు. ఈ వాము మొక్కలను కిచెన్ గార్డెన్లలో సులభంగా పెంచుకోవచ్చు. ఒక్కసారి మొక్క నాటితే చాలు.. అవి ఏపుగా పెరుగుతుంది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *