Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..


Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..

ఫ్యాటీ లివర్ అనేది ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి భారతదేశంలో పెరిగిపోతున్న ఒక సైలెంట్ కిల్లర్ అని డాక్టర్ అన్నారు. మన దేశంలో 40 శాతం మంది సాధారణ ప్రజలు, ఆందోళనకరంగా 20-30 శాతం మంది పిల్లలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించారు. భారతదేశంలో కేవలం 11 శాతం మందికి మాత్రమే డయాబెటిస్ ఉండగా, ఫ్యాటీ లివర్ వ్యాప్తి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ఇది గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, డయాబెటిస్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన సమస్య అని ఆయన స్పష్టం చేశారు.

ఫ్యాటీ లివర్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌ను ఇటీవల మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్(MAFLD)గా పిలుస్తున్నారు. ఊబకాయం, అధిక ట్రైగ్లిసరైడ్స్, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, డయాబెటిస్ లాంటి అసాధారణ జీవక్రియ సమస్యలు ఉన్నవారిలో ఈ MAFLD ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్‌కు కారణాలలో జన్యుపరమైన అంశాలు కూడా ముఖ్యమైనవి. PNPLA3 అనే జన్యువులో మార్పులు సంభవించినప్పుడు కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఈ జన్యు మార్పు భారతీయులలో ఎక్కువగా ఉండటం వల్ల, స్థూలకాయం లేనివారిలో కూడా లీన్ ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరో ప్రధాన కారణం. ముఖ్యంగా, ఫ్రక్టోస్ లివర్‌కు అత్యంత ప్రమాదకరమైనది. పండ్లలో సహజంగా ఉండే ఫ్రక్టోస్ కంటే, ఫ్రూట్ జ్యూస్‌లలో ఉండే స్వచ్ఛమైన ఫ్రక్టోస్(ఫైబర్ లేకపోవడం వల్ల) బేకరీ ఉత్పత్తులు, పేస్ట్రీలలో ఉపయోగించే హై-ఫ్రక్టోస్ కార్న్ సిరప్‌లు చాలా హానికరం. పదేపదే ఉపయోగించిన వంట నూనెలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, రంగులు కలిపిన ఆహారాలు, మైక్రో ప్లాస్టిక్స్ కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీస్తాయి. సరైన నిద్ర లేకపోవడం, స్లీప్ అప్నియా, తీవ్రమైన ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం లాంటి జీవనశైలి అంశాలు కూడా ఈ సమస్యకు దోహదపడతాయి.

ఫ్యాటీ లివర్ ప్రారంభ దశల్లో ఎటువంటి లక్షణాలను చూపదు. అందుకే దీనిని గుర్తించడం కష్టం. వ్యాధి ముదిరిన తర్వాత అలసట, నీరసం, చిరాకు, కాలేయ పనితీరులో అసాధారణ మార్పులు, మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కామెర్లు, సిరోసిస్ వంటివి చాలా ఆలస్యంగా కనిపించే దశలు. ఫ్యాటీ లివర్ కేవలం కాలేయ సమస్య మాత్రమే కాదని, ఇది శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీసి డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలకు దారి తీస్తుందన్నారు. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి మరణానికి ప్రధాన కారణం గుండె జబ్బులే కావడం దీని తీవ్రతకు నిదర్శనం అని చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *