Health: కొంగలా ఒంటికాలిపై ఎంతసేపు నిల్చొగలరు.? ఇలా చేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందట

Health: కొంగలా ఒంటికాలిపై ఎంతసేపు నిల్చొగలరు.? ఇలా చేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందట


ఒంటి కాలిపై నిలబడే సామర్థ్యం మీకుందా.? అయితే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది అనే విషయాలను చెప్పేస్తుంది. వయసుతో పాటు తగ్గే కండరాల పటుత్వం, మెదడు పనితీరును ఇది సూచిస్తుంది. క్రమం తప్పకుండా ఒంటి కాలి బ్యాలెన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల బలం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వయసు పెరిగే కొద్దీ ఒంటి కాలుపై నిలబడటం కష్టమవుతుంటుంది. అయితే, ఈ తేలికపాటి వ్యాయామం ద్వారా మన ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది బలాన్ని పెంచి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని, మెదడును ఆరోగ్యకరంగా ఉంచుతుందని అంటున్నారు.

ముప్పై ఏళ్ల తర్వాత ప్రతి పదేళ్ల కాలంలో కండరాల పటుత్వం ఎనిమిది శాతం తగ్గుతుంది. కండరాల బలహీనత రక్తంలో చక్కెర నియంత్రణ తగ్గడం నుంచి రోగనిరోధక శక్తి బలహీనపడటం వరకు అనేక సమస్యలతో ముడిపడి ఉంది. ఒంటి కాలి బ్యాలెన్స్ వ్యాయామం చేయడం వల్ల కండరాల బలహీనతను తగ్గించుకోవచ్చునని.. కాళ్లు, నడుము కండరాలను బలంగా ఉంచుకోవచ్చునని చెబుతున్నారు. ఒక కాలుపై నిలబడగలిగే సామర్థ్యం మెదడు పనితీరుతో కూడా ముడిపడి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. స్పందించే వేగం, రోజువారీ పనుల్లో సామర్థ్యం, ఇంద్రియ వ్యవస్థల సమాచారాన్ని మెదడు గ్రహించే శక్తి వంటివి దీని ద్వారా అంచనా వేయవచ్చునన్నారు. 65 ఏళ్లు పైబడిన వారిలో బ్యాలెన్స్ కోల్పోయి పడిపోవడం వల్ల గాయపడే ప్రమాదం పెరుగుతుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఒంటి కాలిపై సాధన చేయడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *