ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైన అరవ శ్రీధర్ కేసు బాధితురాలు హర్షవీణ మరొక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆమె తన విషయంలో కొందరు పవన్ కళ్యాణ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత అంశాన్ని కావాలనే రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్‌ను కలిసి అన్ని ఆధారాలు ఇస్తానని హర్షవీణ స్పష్టం చేశారు. తనది తప్పు అని రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు. ఎమ్మెల్యే విప్ లేకుండా శ్రీధర్‌కు చేసిన విషయాలపై తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆయన ఇంతకు ముందే జైల్లో ఉండేవారని హర్షవీణ పేర్కొన్నారు. శ్రీధర్‌కు ఎమ్మెల్యే విప్ ఉన్నందువల్లే ఆయన ధైర్యంగా తిరగగలుగుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ రంగు పులుముతున్నారని హర్షవీణ వ్యాఖ్యానించారు. తాను రాజకీయాలు చేయడం లేదని, న్యాయం కోసమే పోరాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో త్వరగా తనను కలిసి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
KCR కుటుంబం తెలంగాణ ప్రజల్ని క్షమాపణ అడగాలి
YS జగన్ తో హీరో సూర్య, కార్తీ, మోహన్ బాబు
Mumbai: ముంబైలో చిరుత కలకలం
కర్ణాటకలో కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్
ఎన్నాళ్లీ మంటలు.. భయపెడుతున్న అగ్నిప్రమాదాలు