సిరిసిల్ల నేతన్న మరో అద్భుతాన్ని ఆవిష్కరణ చేశాడు. సింధూర్ ఆపరేషన్ గుర్తు చేసే విధంగా ఓ శాలువాను తయారు చేశాడు. ఈ నెల 7 న చేనేత దినోత్సవం సందర్బంగా పీఎం..కి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సిరిసిల్ల నేతన్నలు.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు అభినందనలు తెలుపుతూ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను కళా రూపంలో అగ్గిపెట్టెలో పట్టే విధంగా చేనేత మొగ్గంపై అగ్గిపెట్టలో ఇమిడే ఆపరేషన్ సిందూర్ బంగారు శాలువాను సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపుందించాడు.
ఆ శాలువాను ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కి పంపించనున్నారు. ఈ శాలువాను మూడు రోజుల పాటు తయారు చేశాడు. శాలువా బరువు 100 గ్రాములు ఉంది.. రెండు గ్రాముల బంగారం తో తయారు చేశారు. రెండు మీటర్లు పొడువు..38 ఇంచుల వెడల్పు తో ఈ శాలువా ను తయారు చేశారు. ఈ శాలువా ను అగ్గి పెట్టేలో ఇమేడే విధంగా తయారు చేసి..తన నైపుణ్యాన్ని నిరూపించాడు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ పహాల్గంలో ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరం అని యావద్దేశం ఏకతాటీ పై నిలబడి ముక్తకంఠంతో అట్టి దాడిని ఖండించడం జరిగిందని అన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ పహల్గం దాడిని తీవ్రంగా పరిగణించి దాడికి ప్రతి చర్యగా త్రివిధ దళాలతో మన సత్తా చాటి దాయాది దేశానికి ముష్కరులకు, ప్రపంచ దేశాలకు భారతీయ త్రివిధ దళాల సత్తా ఏంటో తెలియజేశారని అన్నారు. ఈ విజయానికి గుర్తుగా ఆపరేషన్ సిందూర్ బంగారు శాలువా రూపొందించానని తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…