Haldi Function: పెళ్లికి ముందు హల్దీ వేడుక ఎందుకు? ఆధ్యాత్మిక, సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే

Haldi Function: పెళ్లికి ముందు హల్దీ వేడుక ఎందుకు? ఆధ్యాత్మిక, సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే


భారతీయ సంప్రదాయంలో వివాహ వేడుక ఇద్దరు వ్యక్తులను కలిపే వేడుక మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను , అనేక ఆచారాలు కలిపి జరిపే భారతీయ సంస్కృతిని గురించి తెలిపే విడదీయరాని బంధం. పెళ్లికి ముందు జరిపే ఆచారాల్లో ఒకటి హల్దీ వేడుక. వివాహానికి ముందు వధూవరులకు పసుపును పూస్తారు. అయితే ఇలా పసుపు రాయడం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..!

హల్దీ వేడుక కేవలం ఒక ఆచారం కాదు. మన అమ్మమ్మల కాలం నుంచి కొనసాగుతున్న ఈ ఆచారం వెనుక మనకు తెలియని అనేక తెలియని రహస్యాలు దాగున్నాయి. ఈ నేపద్య్మలో ఈ రోజు మనం వివాహానికి ముందు వధూవరులకు పసుపును పూయడం ఎందుకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

పసుపు ఆచారం అందం కంటే గొప్పది.
భారతీయ సంప్రదాయంలో పసుపును కేవలం సుగంధ ద్రవ్యంగా చూడడమే కాదు.. దీనిని పవిత్రమైన ఔషధంగా భావిస్తారు. దీనిని ఆయుర్వేదం, వేదాలలో ‘హరిద్ర’ అని పిలుస్తారు. అంటే శుద్ధి, రక్షణకు చిహ్నం.

ఇవి కూడా చదవండి

వధువు శరీరంపై పసుపు పూసినప్పుడు.. దానికి అర్థం- “ఇక నుంచి గతాన్ని వదిలివేయి. పూర్తిగా సిద్ధమై.. కొత్త జీవితాన్ని ప్రారంభించండి.” ఇది చర్మం మెరుపు కంటే ఎక్కువ. అంటే వధువుకి పసుపు రాయడం అంటే మనస్సు శుద్ధికి సంకేతం అని అర్ధం. పుట్టుక లేదా మరణానికి ముందు శుద్ధి జరిగినట్లే.. అదేవిధంగా వివాహానికి ముందు వధువుని పసుపు రాసి శుద్ధి చేస్తారట.

ఈ వేడుక వెనుక జీవిత పాఠాలు
హల్ది వేడుక కోసం ధరించే దుస్తులు పాతవి. నేలపై కూర్చుంటారు. పసుపు మరకలు ప్రతిచోటా కనిపిస్తాయి. అయితే ఈ వేడుకక్కి నిజానికి ఇదే అందం. ఈ ఆచారం పాటించడం వెనుక ఉన్న అర్ధం ఏమిటంటే.. జీవితం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. ప్రేమ ఎప్పుడూ సినిమాగా సాగదు.. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలకు అలవాటు పడాలి.. ఎందుకంటే అదే జీవితం. యువతి నుంచి స్త్రీగా మారే ఆ చెప్పలేని క్షణం. ఇక నుంచి జీవితంలో ఎదీ నియంత్రణలో ఉండదు. అసంపూర్ణత కూడా అందమైనదని అంగీకరించే సమయం ఇదని ఈ వేడుక తెలియజేస్తుందట.

ఆరోగ్య ప్రయోజనాలు
పసుపు ఆహారానికి రంగు, రుచిని జోడించడమే కాదు ఔషధ గుణాలను కలిగి ఉంది. హల్దీ క్రిమినాశకి. అంతేకాదు జీర్ణకోశ, అనేక ఇతర వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. మరో వైపు సౌందర్య ప్రయోజనాలు ఇస్తుంది. పసుపును రాయడం వలన వధూవరుల చర్మ సౌందర్యం .. ప్రకాశవంతంగా చేయడంలో సహాయపడుతుంది.

ప్రియమైనవారిని కలిపే వేడుక
హల్ది ఆచారంలో వధువు సోదరీమణులు, అత్తమామలు, అత్తమామలు,స్నేహితులు ఒకే చోటకు చేరతారు. ప్రతి ఒక్కరూ వధూవరుల ముఖం, చేతులు, కాళ్ళకి పూస్తారు. అంటే ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది ఒక భావోద్వేగ సంబంధం. ఈ స్పర్శతో పాటు ఆశీర్వాదం అందిస్తారు. మేము నీకు తోడుగా ఉన్నాం అని చెప్పకనే చెప్పే సంప్రదాయం ఈ హల్దీ వేడుక

భూమికి అనుసంధానం
ఈ హల్దీ వేడుక ఎంత గొప్పవారైనా వధువరులను నేల మీదనే కూర్చోబెట్టి చేస్తారు. వధువు సాధారణ దుస్తులలో, కాళ్ళు ముడుచుకుని నేలపై కూర్చుంటుంది. భారతీయ సంప్రదాయంలో, భూమిని తల్లిగా భావిస్తారు. పూజ నుంచి వివాహం వరకు ప్రతి పవిత్ర కార్యాన్ని నేలపై కూర్చొని చేయడానికి ఇదే కారణం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *