
హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు జనరేషన్‌కి ఉన్న ప్రధానమైన సమస్య. కొందరికీ అయితే ఇరవైళ్లలోనే జుట్టుంతా ఊడిపోయి.. బట్టతల వచ్చేస్తుంది. ఒకప్పుడు అయితే బట్టతల కనిపించకుండా ఉండేదుకు క్యాప్స్ వాడేవారు. కానీ ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయ్. విగ్, ప్యాచ్ అనేవి ఇప్పటి జనరేషన్ వాళ్లు బాగా వినియోగిస్తున్నారు. కాస్త సంపన్నులు అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్తున్నారు. అసలు విగ్, ప్యాచ్, ట్రాన్స్‌ప్లాంట్ బేధాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం…
హెయిర్ ప్యాచ్ అంటే..? ఒక టైలర్‌మెడ్ ఆర్టిఫిషియల్ జుట్టు పీస్‌లాగా ఉంటుంది. తల మీద జుట్టు లేని చోట మాత్రమే ఫిక్స్ చేస్తారు. క్లిప్స్ లేదా గ్లూతో అంటిస్తారు. అసలైన జుట్టులా కనిపించేలా డిజైన్ చేస్తారు. హెయిర్ కట్ చేసి.. ఆ ప్రాంతంలో నీట్‌గా కనిపించేలా ఎడ్జెస్ట్ చేస్తారు. కొంచెం కేర్ తీసుకుంటే 6-8 నెలలు దీన్ని వాడవచ్చు. ఖర్చు తక్కువ. వెంటనే లుక్ మారిపోతుంది. బయటికి వెళితే కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే.. తడిసినపుడు జాగ్రత్తగా ఉండాలి. వారం–పదిరోజులకు మళ్లీ ఫిక్స్ చేయించుకోవాలి. దగ్గరగా చూసే వాళ్లకి ఫేక్ అనిపించొచ్చు.
విగ్ అంటే..? ఇది ఫుల్ తలపైనే ఉంటుంది. స్కాల్ప్ అంతా కవర్ చేస్తుంది. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ వచ్చేస్తుంది. పార్టీల్లో, షూటింగ్‌ల్లో ఎక్కువగా వాడతారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కి జుట్టు పోయినవాళ్లూ విగ్ పెట్టుకుంటారు. ఈజీగా తీసేసి, మళ్లీ పెట్టుకోవచ్చు. చాలా వెరైటీలు అందుబాటులో ఉంటాయి. తక్కువ టైమ్‌లో పూర్తిగా లుక్ మార్చేసే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్ అకేషన్స్‌కి బాగా యూజ్ అవుతుంది. అయితే కొంచెం ఆర్టిఫిషియల్‌గా కనిపించొచ్చు. చెమట ఎక్కువగా వస్తే ఇబ్బంది అవుతుంది. ఎక్కువగా వాడితే హెడ్‌హీట్ అవుతుంది.
ఇక హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే..?ఇది ఓ చిన్న సర్జరీ లాంటిది. జుట్టు ఉన్న చోట (ఉదాహరణకి తల వెనుక భాగం) నుంచి రూట్లను తీసి, జుట్టు లేని చోట వేస్తారు. అలా వేసినచోట ఎప్పటిలానే జుట్టు పెరుగుతుంది. షాంపూ వాడొచ్చు… ఇష్టమొచ్చిన స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు. టైం, ఖర్చు ఎక్కువ… కానీ లైఫ్ లాంగ్ సొల్యూషన్. అసలైన జుట్టులా పెరుగుతుంది. వర్షంలో తడిచినా ఏం కాదు. అయితే సర్జరీ కాబట్టి కాస్త ఖర్చు ఎక్కువ. రిజల్ట్ కనిపించాలంటే 6 నెలల టైం పడుతుంది. మంచి క్లినిక్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే డబ్బు పోగా.. రిజల్ట్ కూడా సరిగ్గా ఉండదు.
బడ్జెట్, మీ పేషన్స్, పర్పస్‌ని బట్టి మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో.. జుట్టు పోతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ వచ్చేసింది. జుట్టు తిరిగి వస్తోంది. కేవలం జుట్టు కాదు… స్టైల్, కాన్ఫిడెన్స్ కూడా రీబిల్డ్ అవుతుంది.
ఈ మూడు ఆప్షన్స్ మాత్రమే కాకుండా హెయిర్ ఫైబర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. హెయిర్ లైన్ వెనక్కి పోయినా, స్కాల్ప్ కనిపిస్తున్నా… ఈ ఫైబర్ పౌడర్ చల్లి కప్పేయొచ్చు. చాలా మంది యాక్టర్స్, యూట్యూబర్స్ ఈ హ్యాక్ వాడతారు. 5 నిమిషాల్లో ఫుల్ హెయిర్ లుక్ వస్తుంది. తడిస్తే పోతుంది. తాత్కాలికం మాత్రమే. దగ్గరగా చూసినవాళ్లకు వెంటనే తేడా కనిపిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..