మన గట్ ఆరోగ్యంగా ఉంటేనే మన మెదడు, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. గట్ అనారోగ్యంగా ఉంటే.. అది మన మెదడుపై, శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే గట్‌ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మూడు ముఖ్యమైన సీడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చియా సీడ్స్
ఈ విత్తనాలలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టినప్పుడు జెల్ లాగా మారతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. మలాన్ని మెత్తగా చేసి పేగును శుభ్రపరచడంలో సాయపడతాయి. చియా విత్తనాలను ఎప్పుడూ నానబెట్టి మాత్రమే తినాలి. వాటిని బెర్రీలు, పెరుగు, బాదం పాలు లాంటి వాటితో కలిపి తీసుకోవచ్చు.
సబ్జా గింజలు
సబ్జా గింజలు చియా విత్తనాలకు సమానమే కానీ మరింత చల్లదనాన్ని ఇస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరానికి చలవ చేస్తాయి. వీటిని ఓట్‌మీల్, బాదం పాలు లేదా బాదం పెరుగు లాంటి వాటితో కలిపి తినొచ్చు.
అవిసె గింజలు (Flax seeds)
అవిసె గింజలు చిన్నగా ఉన్నా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని పొడి చేసి మాత్రమే తినాలి. అప్పుడు మాత్రమే శరీరానికి పూర్తి పోషకాలు లభిస్తాయి. వీటిలోని పోషకాలు శరీరంలో వాపును తగ్గించడంలో, హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సాయపడతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)