ఆగస్టు 2025లో గురువు రెండు సార్లు సంచారము చేయబోతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనది. ఆగస్టు 13న గురువు పునర్వసు నక్షత్రం మొదటి పాదం లోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ఆగస్టు 30న పునర్వసు రెండవ పాదంలో సంచారము చేస్తాడు. ఈ రెండు సార్లు గురు సంచారం సమయం అనేక రాశులకు సువర్ణావకాశాలను తెస్తుంది. ఈ సమయంలో కొంతమంది కెరీర్ పురోగతి, వ్యాపారంలో లాభం, గౌరవం, జీవితంలో స్థిరత్వం వంటి పెద్ద సానుకూల మార్పులు కలిగే అవకాశం ఉంది. అంతేకాదు కొన్ని రాశుల వారికి ఈ సంచారము విదేశీ ప్రయాణానికి, కొత్త ఉద్యోగానికి లేదా పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభానికి కూడా తలుపులు తెరుస్తుంది. కనుక గురువు ఈ రెండు సంచారము వల్ల ఏ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వారికి ఆగస్టులో బృహస్పతి సంచారము అనేక సానుకూల అవకాశాలను తెస్తుంది. ఈ సమయంలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ ఒప్పందాన్ని పొందే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో లాభాన్ని తెస్తుంది. ఉద్యోగస్తులకు ఈ కాలం పురోగతి, ఆదాయంలో పెరుగుదలను సూచిస్తుంది. పదోన్నతి అవకాశాలు కూడా కలగవచ్చు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలను పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు ప్రేమికుల సంబంధం మెరుగుపడుతుంది. పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. ఈ సమయం ఆర్థిక దృక్కోణంలో చూస్తే చాలా బలంగా ఉంటారు. వ్యాపారస్తులు పెట్టుబడి నుంచి లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీనితో పాటు సమాజంలో వీరి ప్రజాదరణ పెరుగుతుంది. గౌరవం లభిస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులకు గురు సంచారంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా పెరుగుతుంది. దీని కారణంగా వీరు ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు గురు గ్రహంలో మార్పు ప్రభావం చాలా సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు మానసిక ప్రశాంతత, సమతుల్యతను అనుభవిస్తారు. ఇంట్లో, కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారవేత్తలకు కొత్త భాగస్వాములతో కలిసి పనిచేసే అవకాశాలున్నాయి. ఇది భవిష్యత్తులో వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి ఆదాయాలు పొందే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య బంధం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కెరీర్ లో వృద్ధి చెందే అవకాశం ఉంది. అదృష్టంతో పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుంది. అనేక రంగాలలో పురోగతి వైపు పయనిస్తారు.
ఇవి కూడా చదవండి
మీన రాశి: ఈ రాశికి అధిపతి బృహస్పతి. కనుక వీరు గురు సంచారంతో నక్క తోకని తోక్కినట్లే. గురు సంచార ప్రభావం వీరికి ప్రత్యేక శుభాన్ని తెస్తుంది. ఈ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో లేదా శుభకార్యంలో పాల్గొంటారు. ఇది మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వ్యాపారంలో ఉన్నవారు పెట్టుబడుల నుంచి మంచి లాభం పొందనున్నారు. ఆర్థిక పరిస్థితి బల పడుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషణ ఫలిస్తుంది. మొత్తంమీద ఈ సమయం ఈ రాశికి చెందిన వ్యక్తులకు పురోగతి, స్థిరత్వం, శ్రేయస్సు వైపు పయనించడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ గురు సంచార సమయం అని చెప్పవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.