Gold Rate: భారత్‌ కంటే ఈ 5 దేశాలలో అతి తక్కువ ధరకే బంగారం.. ఆ దేశాలు ఏంటో తెలుసా?

Gold Rate: భారత్‌ కంటే ఈ 5 దేశాలలో అతి తక్కువ ధరకే బంగారం.. ఆ దేశాలు ఏంటో తెలుసా?


Gold Price: ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా బంగారం ఒక క్లిష్టమైన దశలో ఉంది. మరింత ప్రత్యేకంగా చెప్పాలంటే బంగారం సామాన్యుల భారంగానే మారింది. ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటేనే భయపడి రోజులు వచ్చాయి. అదే విధంగా వెండి మాత్రం సునామీలా దూసుకుపోతోంది. ఈ పరిస్థితిలో భారతదేశంతో పోలిస్తే ప్రపంచంలోని కొన్ని దేశాలలో మీరు తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆ దేశాలు ఏంటో తెలుసుకుందాం..

  1. దుబాయ్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 2,200 AEDకి అమ్ముతారు. అంటే భారత కరెన్సీలో రూ. 1,17,531. భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,44,200కి అమ్ముతారు. ఈ సందర్భంలో మీరు దుబాయ్‌లో బంగారం కొనడం ద్వారా రూ. 22,669 ఆదా చేసుకోవచ్చు.
  2. హాంకాంగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 7,750 హాంకాంగ్ డాలర్‌లకు అమ్ముతారు. అంటే భారత కరెన్సీలో రూ. 1,01,500. భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,44,200 ఉంది. ఈ సందర్భంలో మీరు హాంకాంగ్‌లో బంగారం కొనడం ద్వారా రూ. 42,700 ఆదా చేసుకోవచ్చు.
  3. స్విట్జర్లాండ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 80 CHF ఉంది. అంటే భారత కరెన్సీలో రూ. 80,630. మీరు భారత్‌లో ఉన్న ధరతో పోల్చుకుంటే మీరు స్విట్జర్లాండ్‌లో బంగారం కొనుగోలు చేయడం ద్వారా రూ. 63,570 ఆదా చేసుకోవచ్చు.
  4. సింగపూర్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 145 సింగపూర్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ. 98,300. మీరు ఇక్కడి ధరతో పోల్చుకుంటే మీరు సింగపూర్‌లో బంగారం కొనడం ద్వారా రూ. 45,900 ఆదా చేసుకోవచ్చు.
  5. టర్కీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 4,050 TRYలకు కొనుగోలు చేయవచ్చు. అంటే భారత కరెన్సీలో రూ. 1,00,600. భారతదేశంలో ఉన్న ధరతో పోలిస్తే టర్కీలో బంగారం కొనడం ద్వారా రూ. 43,600 ఆదా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Double Decker Bus: గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే..!

Silver Price: భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *