ప్రపంచ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2027 నాటికి బంగారం ధర ఔన్సుకు 8,650 డాలర్లకు చేరుకుంటుందని కెనడియన్ బ్యాంక్ తెలిపింది. ఇక వెండి ధర ఔన్సుకు 220 డాలర్లకు చేరుకోవచ్చని తన నివేదికలో వెల్లడించింది. ఆర్ధిక వ్యవస్థలో మార్పులు, ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి, కరెన్సీల బలంపై అనిశ్చితితో బంగారం, వెండి వైపు పెట్టుబడులు పెరిగే అవకాశముందని స్పష్టం చేసింది.