Gold Prices: జస్ట్ రూ.12 వేలకే బంగారం.. మీరూ కొనుగోలు చేయొచ్చు.. ఎక్కడో తెలుసా..?

Gold Prices: జస్ట్ రూ.12 వేలకే బంగారం.. మీరూ కొనుగోలు చేయొచ్చు.. ఎక్కడో తెలుసా..?


బంగారం ధరలు ప్రాంతాలు, దేశాలను బట్టి మారుతూ ఉంటాయి. స్థానిక ప్రభుత్వాలు విధించే ట్యాక్సులు, రవాణా ఛార్జీలను బట్టి ధరల్లో మార్పులు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చవక ధరకు బంగారం లభిస్తుండగా.. ట్యాక్సులు ఎక్కువగా వసూలు చేయడం వల్ల మరికొన్ని దేశాల్లో అధిక ధరలు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా దుబాయ్‌లో గోల్డ్ ధరలు అతి తక్కువగా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. దీంతో చాలామంది అక్కడికి వెళ్లి గోల్డ్ షాపింగ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది అక్కడ బంగారం కొని ఇండియాలో అమ్ముకుంటే లాభం వస్తుందని భావిస్తూ ఉంటారు. నిజంగానే అక్కడ కొని ఇక్కడే అమ్మితే లాభం వస్తుందా..? లేదా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

దుబాయ్‌లో చౌక ధరకే బంగారం

గోల్డ్ సిటీగా దుబాయ్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. బంగారం చకవ ధరకు దొరికే దేశం ఇది. ఎందుకంటే అక్కడ ట్యాక్సులు తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం దుబాయ్‌లో 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.12,900గా కొనసాగుతోండగా.. ఇండియాలో రూ.16 వేలుగా ఉంది. దీంతో అక్కడ బంగారం కొని ఇక్కడ అమ్మితే భారీగా లాభాలు వస్తాయని ఆశిస్తారు. అయితే వ్యాపార వర్గాలకు ఇది లాభమే కానీ.. సామాన్యులకు పెద్దగా ప్రయోజనం ఉండదని బిజినెస్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. బంగారంపై కస్టమ్స్ నిబంధనలు చాలా ఉంటాయి. విదేశాల్లో ఏడాది కన్నా ఎక్కువ రోజులు గడిపిన మహిళలు 40 గ్రాములు, పురుషులు 20 గ్రాముల వరకు పన్ను లేకుండా గోల్డ్ ఆభరణాలు తెచ్చుకోవచ్చు. కానీ బంగారు కడ్డీలు, కాయిన్స్ తెచ్చుకుంటే కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అదే పర్యటనలకు వెళ్లి తిరిగొచ్చేవారికి ఎలాంటి ట్యాక్స్ మినహాయింపులు ఉండవు. ఏ టైప్‌లో బంగారం తీసుకొచ్చినా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

వ్యాపారులకు లాభమే..

అయితే వ్యాపారులు బంగారంపై అక్కడ బేరాలు చేసి తక్కువ ధరకు తీసుకోవచ్చు. ఇక్కడ 3 శాతం జీఎస్టీ, కస్టమ్స్ సుంకం, కరెన్సీ మార్పిడి ఛార్జీలు కలుస్తాయి. కానీ బంగారాన్ని అక్కడ తక్కువ రేటుతో తెచ్చుకుని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముకోవడం వల్ల వ్యాపారులకు లాభం జరుగుతుంది. కానీ సామాన్యులకు ఇది కుదరదని నిపుణులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు చాలామంది దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకుని ఇక్కడ విక్రయిస్తుంటారు. అటు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం భారత్‌లోకి వస్తూ ఉంటుంది. ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇవి బయటపడుతూ ఉంటాయి. ఇలా అక్రమంగా తీసుకొచ్చే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *