పసిడి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. గత కొంత కాలంగా నింగిని తాకిన ధరలు ఇప్పుడు నెమ్మదిగా దిగివస్తున్నాయి. లక్షా 80వేల రూపాయలు దాటిన బంగారం ధరలు ప్రస్తుతం లక్షా యాభై వేల రూపాయల కిందకు దిగి వచ్చాయని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు చక్కబడటంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. డాలర్ విలువ బలపడటం కూడా బంగారం ధరల పతనానికి కారమవుతోంది. డాలర్ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు బంగారం మీద నుంచి పెట్టుబడులను డాలర్ విలువ గల ఆస్తుల మీదకు తరలిస్తున్నారు. దీంతో బంగారం ధర ఒడిదుడుకులకు లోనవుతోంది. కాగా ఫిబ్రవరి 18 బుధవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,200లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,350లు పలుకుతోంది. ఇక వెండి ధర కూడా కిలోపై రూ.5000లు తగ్గి రూ.2,60,000లుగా కొనసాగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,350 దగ్గర ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,500 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,200 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,41,350 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,240 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,42,300 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,200 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,350 లు పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,60,000లుగా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pratyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి.. సుప్రీంకోర్టు తీర్పు
Ilaiyaraaja: ఇళయరాజాకు కోర్టు షాక్.. పాటల కాపీరైట్స్‌లో చుక్కెదురు
Chiranjeevi: చిన్న సర్జరీ చేశారు.. మరేం పర్లేదు!
With Love: 10 రోజుల్లో 25 కోట్లు..! దుమ్ము దులుపుతున్న విత్ లవ్ సినిమా కలెక్షన్స్
పాటలో ఎవరికి ఎంత హక్కు ?? IPRS, PPL అంటే ఏంటి ??