Gold Price Today: బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. అలాగే తాజా రేట్ల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.1,58,510కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.1,45,300గా నమోదైంది. ఈ స్వల్ప తగ్గుదలతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలని భావిస్తున్న వారు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇక వెండి విషయానికి వస్తే, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.3 లక్షలుగా కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల్లో రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా ఉండటంతో వెండి కొనుగోలు చేసే వారికి కూడా ఇబ్బంది లేదు. వెండి సాధారణంగా ఆభరణాలు, పాత్రలు, అలాగే పెట్టుబడిగా కూడా కొనుగోలు చేస్తారు.
బంగారం, వెండి ధరలు రోజూ మారడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, డిమాండ్, వడ్డీ రేట్లు వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడితే డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతుంటాయి.
ఇక ఈ నెలలోనే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఇక బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయి. ఈ అంచనాలు నిజమయితే మళ్లీ పది రోజుల క్రితం పరిస్థితి తలెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Electric Cars: భారత మార్కెట్లోకి రానున్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. సింగిల్ ఛార్జ్‌పై 543 కి.మీ రేంజ్!
ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి? వాటి ఉపయోగం ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి