Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?


పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. లక్ష రూపాయలకుపైగా ఎగబాకిన పసిడి.. ఒక్కసారిగా దిగి వస్తున్నాయి. ధరలు రికార్డు స్థాయిల నుండి తగ్గుముఖం పట్టాయి. ఇది బంగారం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే అంశమనే చెప్పాలి. జూన్‌ 26న దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 98,950 వద్దకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,700గా, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74,210గా మారింది. నేడు వెండి ధర కిలోకు రూ. 1,07,900గా ఉంది. తులం బంగారంపై 300 రూపాయలకుపైగా తగ్గింది. గత రెండు, మూడు రోజుల కిందట ధరలను పరిశీలిస్తే వెయ్యి రూపాయలకుపైనే తగ్గిందని చెప్పాలి.

ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

బుధవారం మిశ్రమ సంకేతాల మధ్య బంగారం స్వల్పంగా తగ్గుదలతో దిగువ శ్రేణిలోనే ఉందని HDFC సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ అన్నారు. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య వార్‌ విరమణ ప్రకటన తర్వాత భౌగోళిక-రాజకీయ ఆందోళనలు తగ్గాయని, దీనివల్ల సురక్షితమైన పెట్టుబడి డిమాండ్ తగ్గిందని, అలాగే బంగారం ధరలు రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయని ఆయన అన్నారు.

పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలో వేగంగా హెచ్చుతగ్గులు ఉంటాయి . వాణిజ్య యుద్ధ కారణాల వల్ల బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు నిరంతరం తగ్గుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే విషయం. అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో విదేశీ మార్కెట్లలో కూడా సందడి ఉంది. భవిష్యత్తులో కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,700 వద్ద కొనసాగుతోంది. అలాగే ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.99,100 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,850 వద్ద ఉంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,700 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,700 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *