Gold Price: తులం బంగారం రూ. 2 లక్షలు..! పసిడి ప్రియులకు దిమ్మతిరిగే న్యూస్..

Gold Price: తులం బంగారం రూ. 2 లక్షలు..! పసిడి ప్రియులకు దిమ్మతిరిగే న్యూస్..


పసిడి ప్రియులకు, పెట్టుబడిదారులకు బంగారం ధరలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత వారం చారిత్రక గరిష్టాలను తాకిన ధరలు, ప్రస్తుతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఇవాళ ఈ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటి వరకు కనిపించిన తగ్గుదల తాత్కాలికమేనని, భవిష్యత్తులో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరగనున్నాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం JP మోర్గాన్ షాకింగ్ అంచనాలను వెల్లడించింది. ప్రస్తుత మార్కెట్ అస్థిరతను విశ్లేషించిన JP మోర్గాన్.. 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 6,300 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇదే జరిగితే భారతీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షల మార్కును సునాయాసంగా దాటే అవకాశం ఉంది.

ఎందుకింత పెరగవచ్చు?

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను బంగారం రూపంలో భద్రపరుచుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. పేపర్ ఆస్తుల కంటే రియల్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అస్థిరమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దీర్ఘకాలికంగా బంగారంపై బుల్లిష్ ధోరణి బలంగా ఉందని JP మోర్గాన్ తెలిపింది.

నేటి బంగారం ధరల పరిస్థితి

  • 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ.1,60,530
  • 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ.1,47,150
  • 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,20,400

పెట్టుబడిదారులకు సూచన

గత వారం గరిష్ట ధరల వద్ద కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ధరల తగ్గుదల చూసి ఆందోళన చెందుతున్నారు. కానీ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ స్వల్పకాలిక హెచ్చుతగ్గులు సహజమని, దీర్ఘకాలంలో బంగారం తన రికార్డులను తానే బద్దలు కొడుతూ ముందుకు వెళ్తుందని స్పష్టమవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *