Ghostlighting: ట్రెండింగ్ లో ఘోస్ట్ లైటింగ్.. ఈ విషపూరిత డేటింగ్ ట్రెండ్ గురించి తెలుసా..!

Ghostlighting: ట్రెండింగ్ లో ఘోస్ట్ లైటింగ్..  ఈ విషపూరిత డేటింగ్ ట్రెండ్ గురించి తెలుసా..!


Ghostlighting: ట్రెండింగ్ లో ఘోస్ట్ లైటింగ్..  ఈ విషపూరిత డేటింగ్ ట్రెండ్ గురించి తెలుసా..!

ఈ రోజుల్లో ప్రపంచంలో సంబంధాల విషయంలో కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. కొత్త పదాలను వింటున్నాము. ప్రస్తుతం ఘోస్ట్ లైటింగ్ అనే పదం చాలా చర్చలో ఉంది. ఇది డేటింగ్ లో కొత్త పద్దతి. ఇది “ఘోస్టింగ్”, “గ్యాస్ లైటింగ్” ల కలయిక. గ్యాస్‌లైటింగ్‌లో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తన సొంత అవగాహన, వాస్తవికత లేదా జ్ఞాపకశక్తిపై అనుమానించేలా చేసే ఒక రకమైన మానసిక వేధింపుల పద్ధతి. అదే విధంగా ఘోస్ట్ లైటింగ్ కూడా విడిపోవడంలో ఒక మార్గం. అయితే ఇందులో మీరు ఎవరితోనైనా డేట్ చేస్తున్నప్పుడు.. వారు అకస్మాత్తుగా అదృశ్యమై, ఆ తర్వాత తిరిగి వచ్చి, మిమ్మల్ని సందేహించేలా చేస్తారు. అది ఘోస్ట్ లైటింగ్. ఇది అవతలి వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం..

ఘోస్ట్ లైటింగ్ అంటే ఏమిటి?

ఘోస్ట్ లైటింగ్ అనేది ప్రమాదకరమైన ధోరణి. ఇది ముందు ఉన్న వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ధోరణిలో మీరు డేట్ లో ఉన్న వ్యక్తి మీకు చెప్పకుండానే మీతో సంబంధాన్ని ముగించి సడెన్ గా అదృశ్యమవుతాడు. మీరు మెసేజ్ చేసినా సమాధానం ఇవ్వడు. అతను మిమ్మల్ని విస్మరిస్తాడు. మీకు చెప్పకుండానే మీతో ఉన్న అన్ని సంబంధాలను ముగించేస్తాడు. అయితే అకస్మాత్తుగా అతను తిరిగి వచ్చి.. తాను వెళ్ళిపోవడానికి కారణం నువ్వు అని మీరు తప్పు చేశారు అని నమ్మేలా చేస్తాడు. ఈ రకమైన ప్రవర్తన కారణంగా మిమ్మల్ని మీరు తక్కువగా భావించడం ప్రారంభిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకనే ఘోస్ట్ లైటింగ్ చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. .

ఘోస్ట్ లైటింగ్ సంకేతాలు ఏమిటంటే

ఆకస్మికంగా అదృశ్యం: ఘోస్ట్ లైటింగ్ లో మొదటి సంకేతం ఏమిటంటే.. మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా మీ నుంచి దూరం అవుతాడు. అంటే అతను అకస్మాత్తుగా మీతో మాట్లాడటం మానేస్తాడు. మీరు ఫోన్ చేసినా , మెసేజ్ చేసినా సమాధానం ఇవ్వరు. పూర్తిగా మిమ్మల్ని నిర్లక్షం చేస్తారు.

గందరగోళం: సంబంధంలో గందరగోళం సృష్టిస్తారు. ఉదాహరణకు అతను సోషల్ మీడియాలో మీ చేసే పోస్ట్‌ను ఇష్టపడతాడు. కానీ మీరు ఫోన్ చేసినా లేదా మెసేజ్ లు పంపినా స్పందించడు.

మీదే తప్పుగా నిరూపిస్తారు: మీరు అతని చర్యలకు ప్రతిస్పందించినప్పుడు.. అతను మిమ్మల్ని తప్పుగా నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు.. అతను మిమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నాడని మీరు అడిగితే అతను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు లేదా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారనే భావనను కలిగిస్తాడు.

గుర్తించడం ఎలా: సంబంధంలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా కమ్యూనికేషన్ ఆపేసి, సంబంధాన్ని తెంచుకుని వెళ్ళిపోయి అకస్మాత్తుగా తిరిగి వచ్చి మీ ప్రవర్తనని ప్రశ్నిస్తాడు. మిమ్మల్ని మీరే నమ్మని విధంగా ఆత్మవిశ్వాసం కోల్పోయే విధంగా చేస్తాడు.

ఘోస్ట్ లైటింగ్‌ను గుర్తించడం, దాని నుంచి బయటపడటం ఎలా

మీరు ఎవరితోనైనా డేట్ లో ఉన్నప్పుడు వారు అకస్మాత్తుగా అదృశ్యమై, ఆ తర్వాత తిరిగి వచ్చి, మిమ్మల్ని సందేహిస్తూ నడుచుకుంటే అది ఘోస్ట్ లైటింగ్ కావచ్చు. కనుక ఇలాంటి వ్యక్తుల ప్రవర్తనని గురించిన వెంటనే ఆ సంబంధం నుంచి బయటపడటం మంచిది. మీ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యకరమైన సంబంధాలకు విలువ ఇవ్వండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *