బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది అనుష్క. కానీ ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న స్వీటీ.. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఘాటి సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది ఒకటి. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. విక్రమ్ ప్రభు, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..
నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ ఇప్పుడు సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ మాములుగా లేదు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..
తాజాగా విడుదలైన ట్రైలర్ లో అడియన్స్ ఊహించినదానికంటే ఎక్కువగా వయోలెన్స్ కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా కాలం తర్వాత అనుష్క గూస్ బంప్స్ యాక్టింగ్ తో మరోసారి ఇరగదీసింది. ఈ సినిమాలో కంటెంట్.. అందుకు తగిన ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్ని అంశాలను కలగలిపి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా అనుష్క సినిమాల కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఘాటి సినిమాతో ఫుల్ మీల్స్ అందించబోతున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఘాటి ట్రైలర్..
ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..