అంతా బానే ఉంది కానీ.. ఈ సినిమా రిలీజ్ పై మాత్రం అసలు క్లారిటీనే లేకుండా పోతోంది. యాక్షన్ క్రైమ్ జానర్లో క్రిష్ డైరెక్షన్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ షో కేస్ వేదికగా అనౌన్స్ అయింది. ఈ వేదికగానే ఈ మూవీలో లీడ్ చేస్తున్న అనుష్క ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. దీంతో ఒక్క సారిగా ఈ ప్రాజెక్ట్ పై ఎక్కవ లేని హైప్ వచ్చిపడింది. ఈ క్రమంలోనే ఘాటి సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని మొదట మేకర్స్ భావించారు. కానీ అది కుదరకపోవడంతో… జులై 11కు పోస్ట్ పోన్ చేశారు. కానీ జులై 11 నాటికి సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో.. ఈ సినిమా మేకర్స్ రిలీజ్ చేయకుండా వెనకడుగు వేశారు. ఇక అప్పుటి నుంచి రిలీజ్ పై ఎలాంటి అఫీషియల్ న్యూస్‌ను అనౌన్స్ చేయకుండా సైలెంట్ మెయిన్‌టేన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఘాటీ సినిమా సెప్టెంబర్‌లో కానీ.. నవంబర్‌లో కానీ వచ్చే అవకాశం ఉందట. అయితే సెప్టెంబర్‌లో ఓ బడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే వార్తల నేపథ్యంలో… నవంబర్ వైపు ఘాటీ మేకర్స్ చేస్తున్నారట. అయితే వీళ్ల చూడడాలు పక్కకు పెడితే..ఈ వార్తల విన్న కొంత మంది నెటిజన్స్ మాత్రం మేకర్స్ను విమర్శిస్తున్నారు. దిక్కూ మొక్కు లేకుండా ఇలా తొందర పాటు నిర్ణయాలు తీసుకుని సినిమాను ఇబ్బందుల్లో పెట్టడం ఎందుకని మేకర్స్ తీరును తప్పుబడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క డైలాగ్ దెబ్బకు రిలీజ్ ఆగిపోయిన యోగి సినిమా! అలుపెరగకుండా పోరాడుతున్న టీం
రణబీర్ కపూర్ కంటే అంత గొప్పగా ఏం యాక్టింగ్ చేశావ్? నీకెలా నేషనల్ అవార్డ్ వచ్చింది?
Samantha: ఎవరికో చూపించాలనే సమంత ఇలా చేస్తోందా ??