General Sherman Tree: 2,700 ఏళ్లుగా భూమిపై అజేయంగా.. ఏడు నీలి తిమింగిలాల బరువుతో సమానమైన ఏకైక చెట్టు!

General Sherman Tree: 2,700 ఏళ్లుగా భూమిపై అజేయంగా.. ఏడు నీలి తిమింగిలాల బరువుతో సమానమైన ఏకైక చెట్టు!


అప్పటి పురాతన నాగరికతల నుండి నేటి ఆధునిక సమాజం వరకు అన్ని మార్పులను నిశ్శబ్దంగా చూస్తూ నిలబడిన ఈ వృక్షం వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలేంటో తెలుసుకుందాం.. జనరల్ షెర్మెన్ దాదాపు 275 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు కాకపోయినా, దీని అసలు రికార్డు కాండం పరిమాణంలో ఉంది. ఈ చెట్టు వైశాల్యం దాదాపు 52,500 క్యూబిక్ అడుగులు. నేలపై దీని కాండం వ్యాసం 36 అడుగులు ఉంటుంది. దీని మొత్తం బరువు దాదాపు 1.27 మిలియన్ కిలోలు.

అంటే ఏడు పెద్ద నీలి తిమింగిలాల బరువుతో ఇది సమానం. వేల ఏళ్లు గడిచినా ఈ చెట్టు వృద్ధాప్యం దరిచేరలేదు. ఇది ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ప్రతి ఏటా ఒక 60 అడుగుల ఎత్తు ఉన్న మామూలు చెట్టుకు ఎంత కలప ఉంటుందో, అంత కొత్త కలపను ఈ చెట్టు ఉత్పత్తి చేస్తుంది. 2006లో ఈ చెట్టుకు ఉన్న ఒక పెద్ద కొమ్మ విరిగి పడింది. దాని పొడవు 100 అడుగులు, వెడల్పు 7 అడుగులు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ ఒక్క కొమ్మే మన ఊర్లలో ఉండే పెద్ద పెద్ద చెట్ల కంటే భారీగా ఉంది.

అడవిలో చెట్లు కాలిపోవడం లేదా కుళ్ళిపోవడం సహజం. మరి ఈ చెట్టు వేల ఏళ్లుగా ఎలా బతికి ఉంది? దీని వెనుక ప్రకృతి ఇచ్చిన రక్షణ కవచం ఉంది.

  1.  అగ్నిని తట్టుకునే బెరడు: దీని బెరడు 2 అడుగుల మందంగా, పీచుతో ఉంటుంది. ఇది అడవి మంటల నుండి లోపలి పొరలను రక్షిస్తుంది.
  2. టానిన్ రసాయనం: దీని కలపలో ‘టానిన్’ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఇది చెట్టు కుళ్ళిపోకుండా నిరోధిస్తుంది, కీటకాలు దరిచేరకుండా చూస్తుంది.
    జనరల్ షెర్మెన్ వాల్యూమ్ పరంగా అతిపెద్దది అయితే, వయస్సు పరంగా చిలీలోని ‘గ్రేట్ గ్రాండ్ ఫాదర్’ (5,400 ఏళ్లు) మొదటి స్థానంలో ఉంది. ఎత్తు పరంగా ‘హైపెరియన్’ (380 అడుగులు) అనే కోస్ట్ రెడ్‌వుడ్ ప్రపంచంలోనే నంబర్ వన్. మనిషి జీవిత కాలం వంద ఏళ్లు కూడా దాటడం కష్టమవుతున్న ఈ రోజుల్లో, వేల ఏళ్లుగా స్థిరంగా నిలబడిన జనరల్ షెర్మెన్ మనకు ప్రకృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. భూమిపై ఉన్న ఈ అమూల్యమైన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *