Gen Z Plans: పెట్టుబడుల్లోనూ కొత్తగా ఆలోచిస్తున్న యువత.. మ్యూచువల్ ఫండ్స్ కంటే వాటివైపే మొగ్గు

Gen Z Plans: పెట్టుబడుల్లోనూ కొత్తగా ఆలోచిస్తున్న యువత.. మ్యూచువల్ ఫండ్స్ కంటే వాటివైపే మొగ్గు


Gen Z Plans: పెట్టుబడుల్లోనూ కొత్తగా ఆలోచిస్తున్న యువత.. మ్యూచువల్ ఫండ్స్ కంటే వాటివైపే మొగ్గు

అది కూడా పెళ్లిళ్లు లేదా శుభకార్యాల సమయంలోనే భారీ ఎత్తున కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. స్మైటెన్ పల్స్ ఏఐ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. నేటి జెన్ జెడ్ (Gen Z), మిలీనియల్స్ బంగారం కొనుగోలు చేసే తీరులో కీలక మార్పులు వచ్చాయి. భారీ నగల కంటే తక్కువ బరువున్న కాయిన్లు, చిన్న చిన్న ఆభరణాలకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా తమ మొదటి జీతం రాగానే ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారాన్ని ఎంచుకోవడం విశేషం. పసిడి మార్కెట్‌లో యువత సృష్టిస్తున్న ఈ సరికొత్త ట్రెండ్స్ ఏంటో తెలుసుకుందాం..

ఒకవేళ మీ చేతిలో రూ. 25,000 ఉంటే ఎక్కడ పెట్టుబడి పెడతారు? అని అడిగితే.. మెజారిటీ యువత ఓటు బంగారానికే పడింది. సర్వేలో పాల్గొన్న వారిలో 61.9 శాతం మంది పసిడిని ఎంచుకోగా, మ్యూచువల్ ఫండ్స్ (16.6%), ఫిక్స్‌డ్ డిపాజిట్లు (13%), స్టాక్స్ (6.6%), క్రిప్టో (1.9%) చాలా వెనుకబడి ఉన్నాయి. ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో బ్యాంకు పొదుపు లేదా షేర్ మార్కెట్ కంటే బంగారమే సురక్షితమైన మార్గమని 65.7 శాతం మంది బలంగా నమ్ముతున్నారు. దీన్ని బట్టి స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ఎన్ని ఉన్నా, భారతీయ యువతకు బంగారంపై ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అర్థమవుతోంది.

స్వీయ నిర్ణయాలే కీలకం..

బంగారం కొనుగోలులో కుటుంబ సభ్యుల ప్రభావం తగ్గడం మరో ఆసక్తికర అంశం. సర్వేలో పాల్గొన్న వారిలో 66.7 శాతం మంది బంగారం కొనాలనేది తమ సొంత నిర్ణయమని వెల్లడించారు. జెన్ జెడ్ యువత ఎప్పుడు, ఎలా కొనాలో స్వయంగా నిర్ణయించుకుంటుండగా.. మిలీనియల్స్ మాత్రం ఇంటి అవసరాలు, దీర్ఘకాలిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేస్తున్నారు. సుమారు 42.3 శాతం గృహాల్లో బంగారం కొనుగోలును యువతే స్వయంగా ప్రారంభిస్తున్నారు. అంటే బంగారం ఇప్పుడు కుటుంబ నిర్ణయం నుంచి వ్యక్తిగత ఆర్థిక నిర్ణయంగా మారిపోయింది.

ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనడం కంటే, కొద్ది కొద్దిగా తరచుగా కొనడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. సర్వే ప్రకారం 61.9 శాతం కొనుగోళ్లు 5 గ్రాముల కంటే తక్కువ బరువున్నవే ఉండటం గమనార్హం. ఇందులో 27.5 శాతం మంది 2 గ్రాముల కంటే తక్కువ, 34.4 శాతం మంది 2 నుంచి 5 గ్రాముల మధ్య కొనుగోలు చేస్తున్నారు. ఒకేసారి భారీగా కొనేవారికంటే (58%), చిన్న చిన్న మొత్తాల్లో క్రమం తప్పకుండా కొనేవారి సంఖ్య (42%) వేగంగా పెరుగుతోంది. మొదటి జీతం రాగానే బంగారం కొనడం లేదా ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి కొద్దిగా పసిడిని సొంతం చేసుకోవడం యువతలో ఒక అలవాటుగా మారుతోంది.

విశ్వాసమే పెట్టుబడి..

డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, బంగారం కొనుగోలులో నేటికీ ‘నమ్మకం’ (Trust) అనేదే ప్రధాన పాత్ర పోషిస్తోంది. వచ్చే 12 నుంచి 24 నెలల్లో బంగారం కొనే అవకాశం ఉందని 52.7 శాతం మంది యువత ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం పెళ్లిళ్ల కోసమే వేచి చూడకుండా, తమ వ్యక్తిగత విజయాలను గుర్తు చేసుకునే మైల్‌స్టోన్ లాగా బంగారాన్ని యువత కొనుగోలు చేస్తోంది. బంగారం పట్ల భారతీయుల మక్కువ ఎప్పటికీ తగ్గదు, కానీ దానిని కొనే విధానం మాత్రం ఆధునికతను సంతరించుకుంది. జెన్ జెడ్ తన సొంత మైల్‌స్టోన్స్ కోసం, మిలీనియల్స్ తమ భవిష్యత్తు భద్రత కోసం బంగారాన్ని నమ్ముతున్నారు. మొత్తానికి పసిడి మార్కెట్ బలహీనపడటం లేదు సరే కదా.. యువత ఆలోచనలతో మరింత బలోపేతం అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *