Geeta Singh:’24 ఏళ్లు ప్రాణంగా పెంచుకున్న కొడుకు చనిపోయాడు’.. బిగ్ బాస్ ఎంట్రీపై కితకితలు హీరోయిన్ ఏమన్నారంటే?

Geeta Singh:’24 ఏళ్లు ప్రాణంగా పెంచుకున్న కొడుకు చనిపోయాడు’.. బిగ్ బాస్ ఎంట్రీపై కితకితలు హీరోయిన్ ఏమన్నారంటే?


నార్త్ ఇండియాకు చెందిన గీతా సింగ్ లేడీ కమెడియన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005లో ఎవడి గోల వాడిదే సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించారామె. ఆ తర్వాత కితకితలు సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆడియెన్స్ ను అలరించింది. వీటితో పాటు ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖా పరిణయం, ఆకాశ రామన్న, సీమ టపాకాయ్‌, కెవ్వు కేక, కళ్యాణ వైభోగమే, రెడ్, జంప్ జిలానీ, సరైనోడు, ఈడో రకం అడో రకం, తెనాలి రామకృష్ణ తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు గీతా సింగ్. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన ఆమె చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. సుమారు రెండేళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. అసలు పెళ్లే చేసుకోని గీతాసింగ్ కు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారా? ఆమె తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని వారి బాగోగులను చూసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం పెద్దబ్బాయి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుంచి కోలుకుంటోన్న ఆమె లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకున్నారు. అలాగే బిగ్‌బాస్‌ షోపై తన ఆసక్తిని వెల్లడించారు.

’24 ఏళ్లు ప్రాణంగా పెంచుకున్న నా కొడుకు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. తట్టుకోలేకపోయాను. అప్పుడు నా దగ్గర ఎవరూ లేరు. కనీసం తిన్నావా? లేదా? ఎలా ఉన్నావు? అని అడిగేవాళ్లే లేరు. నాకు నేనే ధైర్యం చెప్పుకుని బతికాను. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడుతున్నాను. అన్నయ్య రెండో కొడుకును కూడా నేనే చూసుకుంటున్నాను. అలాగే కజిన్‌ అన్నయ్య కూతురు కూడా నా దగ్గరే పెరుగుతోంది. ఈ పిల్లల కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను’

గీతా సింగ్ ఫ్రెండ్ షిప్ డే పోస్ట్..

‘ చాలా మంది లాగే నాకు బిగ్‌బాస్‌ షోకు వెళ్లాలనుంది. కానీ ఇంత పేరు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్తవారినే కంటెస్టెంట్స గా సెలెక్ట్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ 9కి ఛాన్స్‌ వస్తే తప్పకుండా వెళ్తాను. అయితే వెళ్లినప్పుడు ఫస్ట్‌ నాగార్జునకు ముద్దు పెట్టాకే మాట్లాడతాను’ అని చెప్పుకొచ్చారు గీతా సింగ్. మరి ఈ లేడీ కమెడియన్ రిక్వెస్ట్ ను నాగార్జున పరిగణనలోకి తీసుకుంటారేమో చూడాలి.

గీతా సింగ్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *