Gautam Gambhir : చరిత్ర సృష్టించిన గౌతమ్ గంభీర్.. 2007 వరల్డ్ కప్‌లో ఆ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Gautam Gambhir : చరిత్ర సృష్టించిన గౌతమ్ గంభీర్.. 2007 వరల్డ్ కప్‌లో ఆ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే


Gautam Gambhir : టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఇప్పుడు మరో భారీ మిషన్‌పై కన్నేశాడు. 2007లో ప్లేయర్‌గా భారత్‌కు పొట్టి ప్రపంచకప్‌ను అందించిన గంభీర్, ఇప్పుడు కోచ్‌గా అదే ఫీట్‌ను రిపీట్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. నిజానికి 2007 టీ20 వరల్డ్ కప్ అంటే మనకు యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు, ధోనీ కెప్టెన్సీ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, ఆ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడానికి వెన్నెముకలా నిలిచింది మాత్రం గౌతమ్ గంభీర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్ ఆఫ్రికాలోని బౌన్సీ పిచ్‌లపై ప్రత్యర్థి బౌలర్లను తనదైన స్టైల్లో ఎదుర్కొని టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

2007 వరల్డ్ కప్‌లో గంభీర్ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి 37.83 సగటుతో 227 పరుగులు చేశాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. కేవలం పరుగులు చేయడమే కాదు, క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకోవడంలో గంభీర్ స్టైలే వేరు. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్లు కోల్పోతున్నా, ఒకవైపు పాతుకుపోయి 54 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్ లేకపోతే భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసేది కాదు, ఆ కప్పు వచ్చేది కూడా కాదు. అందుకే గంభీర్‌ను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని పిలుస్తారు.

గౌతమ్ గంభీర్ బాటలోనే ప్రతి టీ20 వరల్డ్ కప్‌లోనూ ఎవరో ఒక భారతీయుడు పరుగుల వరద పారించాడు. 2009లో యువరాజ్ సింగ్ (153 పరుగులు) అదరగొట్టగా, 2010లో సురేష్ రైనా (219 పరుగులు) తన సత్తా చాటాడు. ఇక రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 2012 (185), 2014 (319), 2016 (273) మరియు 2022 (296) ఏకంగా నాలుగుసార్లు భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. 2021లో కేఎల్ రాహుల్ (194), ఇటీవలి 2024 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ (257) మెరిశారు. వీరందరి కంటే ముందే గంభీర్ ఆ పునాది వేశాడనేది వాస్తవం.

ప్రస్తుతం టీమిండియా పరివర్తన దశలో ఉంది. రోహిత్, విరాట్ వంటి సీనియర్లు టీ20లకు వీడ్కోలు పలకడంతో యువ రక్తాన్ని సిద్ధం చేసే బాధ్యత గంభీర్ భుజాలపై పడింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో, గంభీర్ వ్యూహరచనలో భారత్ 2026 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రెసివ్ మైండ్‌సెట్‌తో ఉండే గంభీర్, యువ ఆటగాళ్లలో అదే పోరాట పటిమను నూరిపోస్తున్నాడు. మైదానంలో గంభీర్ ప్లాన్స్ వర్కవుట్ అయితే, 2007 నాటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *