Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. 2024లో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్, ప్రపంచ నంబర్ 1 జట్టుకు కోచ్‌గా ఉండటం వల్ల భారీగానే జీతం తీసుకుంటున్నారు. కేవలం బీసీసీఐ నుంచి మాత్రమే కాకుండా, ఇంకా చాలా మార్గాల ద్వారా కూడా గంభీర్ భారీగా సంపాదిస్తున్నారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాలు, పెట్టుబడుల ద్వారా ఆయన ఆదాయం గణనీయంగా పెరిగింది. మరి, గౌతమ్ గంభీర్ మొత్తం ఆస్తుల విలువ ఎంత? బీసీసీఐ నుంచి ఎంత జీతం తీసుకుంటున్నారు? ఆయన సంపాదన మార్గాలు ఏంటో ఈ వార్తలో తెలుసుకుందాం.
మీడియా నివేదికల ప్రకారం.. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ సంవత్సరానికి దాదాపు రూ.14 కోట్లు జీతంగా తీసుకుంటున్నారు. దీనితో పాటు, విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు రోజువారీ భత్యంగా రూ.21,000 కూడా లభిస్తుంది. ఇంతకుముందు ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మెంటార్‌గా ఉన్నప్పుడు ఆయన జీతం సంవత్సరానికి రూ.25 కోట్లు. టీమిండియా కోచ్‌గా జీతం తక్కువైనా, ఆయన గౌరవం పెరిగిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
దైనిక్ జాగరణ్ నివేదికల ప్రకారం, గౌతమ్ గంభీర్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.265 కోట్లు. బీసీసీఐ ద్వారా సంవత్సరానికి రూ.14 కోట్లు జీతం వస్తుంది. రెడ్‌క్లిఫ్ ల్యాబ్స్, క్రిక్‌ప్లే, MRF, రీబాక్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. వివిధ వ్యాపారాలలో, రెస్టారెంట్లలో కూడా గంభీర్ పెట్టుబడులు పెట్టారు. 2019-2024 వరకు లోక్‌సభ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయనకు జీతం లభించేది. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
రియల్ ఎస్టేట్‌లో కూడా గంభీర్ భారీగా పెట్టుబడులు పెట్టారు. ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో ఆయనకు ఒక లగ్జరీ బంగ్లా ఉంది, దీని విలువ దాదాపు రూ.20 కోట్లు. దీంతో పాటు, మల్కపూర్ గ్రామంలో రూ.కోటి విలువైన ప్లాట్, నోయిడాలోని జేపీ విష్ టౌన్‌లో రూ.4 కోట్లు విలువ చేసే మరొక ప్లాట్ కూడా ఆయనకు ఉన్నాయి. గంభీర్ కార్ల కలెక్షన్‌లో కూడా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. BMW 530D ధర దాదాపు రూ.74 లక్షల నుంచి మొదలవుతుంది. Audi Q5 ధర రూ.68-74 లక్షల మధ్య ఉంటుంది. వీటితో పాటు మహీంద్రా బొలేరో స్టింగ్గర్, మారుతి సుజుకి SX4, టయోటా కరోలా వంటి కార్లు కూడా ఆయన వద్ద ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..