ఇంట్లో ప్రతీఒక్కరూ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ మూడు నెలల పాటు వస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో కుటుంబసభ్యులు ఎక్కువగా ఉంటే రెండు నెలలకుపైగా వస్తుంది. కానీ గ్యాస్ త్వరగా ఖాళీ అవుతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. తాము ఎక్కువగా ఉపయోగించకపోయినా త్వరగా అయిపోతుందని అనుమానపడుతూ ఉంటారు. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల గ్యాస్ వెంటనే ఖాళీ అవుతుంది
కొన్ని ట్రిక్స్ పాటించడం వల్ల గ్యాస్ వృథా కాకుండా అడ్డుకోవచ్చు. వీటి వల్ల ఎక్కువ రోజులు మీ గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఆ చిట్కాలు ఏంటంటే.. బర్నర్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ బర్నర్ మీద వంట చేసేటప్పుడు అనేక చెత్తాచెదారం పడుతూ ఉంటుంది. ఇవి బర్నర్ రంధ్రాల్లోకి వెళ్లి గ్యాస్ సరిగ్గా రాకుండా అడ్డుకుంటుంది.
దుమ్ము పోవడం వల్ల వంట చేసేటప్పుడు ఊడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే మంట నీలి రంగులో కాకుండా పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీ గ్యాస్ వేస్ట్ అవుతుందని అర్థం చేసుకోవాలి. వెంటనే బర్నర్లను క్లీన్ చేసుకుంటే గ్యాస్ మంట ఎక్కువగా వచ్చి వంట ఫాస్ట్‌గా పూర్తవుతుంది.
ఇక తడి పాత్రలను గ్యాస్ స్టవ్‌పై పెట్టకండి. తడి ఆరిన తర్వాతే పాత్రలను వాడండి. తడి పాత్రలపై ఉన్న తేమ ఆరిపోవడానికి ఎక్కువ సయమం పడుతుంది. దీని వల్ల గ్యాస్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. దీంతో పొడి పాత్రలను లేదా పాత్రలను ఏదైనా క్లాత్‌తో తుడిచి ఆ తర్వాత ఉపయోగించండి.
ఇక ఫ్రిజ్ నుంచి కూల్‌గా ఉన్న పదార్ధాలను తీశాక వెంటనే గ్యాస్‌పై వేడి చేయకండి. కూల్‌గా ఉన్న పదార్థాలు వేడి అవ్వడానికి మరింత సమయం పడుతుంది. దీని వల్ల గ్యాస్ ఎక్కువ ఖర్చువుతుంది. దీంతో కాసేపు ఆగాక గ్యాస్‌పై పెట్టండి. దీని వల్ల మీ గ్యాస్ ఆదా అవుతుంది.
ఇక వంట చేసేముందు కావాల్సిన అన్ని పదార్థాలను ముందుగానే రెడీ చేసుకోండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి వంట స్టార్ట్ చేయండి. ఇక వంట చేసేటప్పుడు పాత్రలపై మూతలు పెట్టండి. దీని వల్ల ఆవిరి బయటకు పోకపోవడం వల్ల త్వరగా వేడి అవ్వుతుంది. ఇక పప్పు, బియ్యం వంటివి వంటకు అరగంట ముందు నానబెడితే మరింత వేగంగా ఉడుకుతుంది.





