Gas Cylinder Hack: సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా?..చాలా మందికి తెలియని ట్రిక్స్ ఇవే..

Gas Cylinder Hack: సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా?..చాలా మందికి తెలియని ట్రిక్స్ ఇవే..


Gas Cylinder Hack: సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా?..చాలా మందికి తెలియని ట్రిక్స్ ఇవే..

వంట చేస్తున్నప్పుడో ఆఫీసులకు టైమ్ అయిపోతున్నప్పుడో సడెన్ గా ఇంట్లో గ్యాస్ అయిపోతే ఎలా ఉంటుంది.. అందుకే చాలా మంది గ్యాస్ సిలిండర్ ను ఊపుతూ ముందునుంచే గాబరా పడిపోతుంటారు. అయితే ఇలా సిలిండర్ ను షేక్ చేయడం అన్నిసార్లూ అంత మంచిది కాదు. దానికి బదులుగా వంట గదిలో గ్యాస్ అయిపోవడానికి ముందే కొన్ని సంకేతాల ద్వారా మనం దానిని గుర్తించవచ్చు.

తడి బట్ట పరీక్ష

ఇది అత్యంత ప్రజాదరణ పొందిన సురక్షితమైన పద్ధతి. ఒక తడి బట్టను తీసుకుని సిలిండర్ చుట్టూ చుట్టండి. రెండు నిమిషాల తర్వాత ఆ బట్టను తీసివేస్తే, సిలిండర్ పైభాగం త్వరగా ఆరిపోతుంది. కానీ గ్యాస్ ఉన్న భాగం మాత్రం కాసేపటి వరకు తడిగానే ఉంటుంది. దీని ద్వారా గ్యాస్ ఏ స్థాయి వరకు ఉందో మీరు స్పష్టంగా గుర్తించవచ్చు.

మంట రంగును గమనించండి

సాధారణంగా గ్యాస్ పొయ్యి వెలిగించినప్పుడు మంట ‘నీలం’ రంగులో రావాలి. ఒకవేళ మంట పసుపు లేదా నారింజ రంగులోకి మారుతుంటే.. సిలిండర్‌లో గ్యాస్ నిల్వలు తగ్గిపోయాయని అర్థం. లోపల గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్ కలయిక వల్ల మంట రంగు మారుతుంది.

ఆహారం ఉడికే సమయం

మీరు ప్రతిరోజూ చేసే వంటకాలకు పట్టే సమయం కంటే ఎక్కువ సమయం పడుతుంటే, సిలిండర్‌లో ప్రెజర్ తగ్గిందని గమనించాలి. గ్యాస్ అయిపోయే స్థితిలో ఉన్నప్పుడు ప్రెజర్ తగ్గి వంట నెమ్మదిగా సాగుతుంది.

సన్నని వాసన

కొన్నిసార్లు సిలిండర్ చివరి దశకు వచ్చినప్పుడు ఒక రకమైన వింత వాసన వస్తుంటుంది. లోపల ఉండే ద్రవం (LPG) అట్టడుగుకు చేరినప్పుడు ఆ వాసన బయటకు వస్తుంది. ఇలా వాసన వస్తున్నా, మంట సరిగ్గా రాకపోయినా సిలిండర్ మార్చాల్సిన సమయం వచ్చిందని తెలుసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *