సనాతన ధర్మంలో మరణం తరువాత గరుడ పురాణాన్ని పఠించే సంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు ఈ గరుడ పురాణాన్ని 13 రోజులు పఠిస్తారు. మత విశ్వాసం ప్రకారం గరుడ పురాణాన్ని పఠించడం వల్ల ఆత్మకు శాంతి, మోక్షం , విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఎవరైనా ఆహ్వానించబడని అతిథిగా ఎవరి ఇంటికైనా వెళ్ళడం వలన అతను తదుపరి జన్మలో ఏమి అవుతాడో కూడా ఈ మహాపురాణంలో ప్రస్తావించబడింది. అటువంటి పరిస్థితిలో ఆహ్వానించకుండా అతిథులుగా వెళ్ళిన వ్యక్తులు తదుపరి జన్మలో ఏమి అవుతారో తెలుసుకుందాం.
కర్మ ఆధారంగా స్వర్గం లేదా నరకం
గరుడ పురాణం 18 మహాపురాణాలలో ప్రధాన గ్రంథాలలో ఒకటి. దీనిలో జీవితం, మరణం, పునర్జన్మ గురించి రహస్యాలు వివరంగా ప్రస్తావించబడ్డాయి. ఒక వ్యక్తి తన కర్మల ఆధారంగా మరణం తరువాత స్వర్గం లేదా నరకాన్ని పొందుతాడని ఇది చెబుతుంది. దీనితో పాటు జీవితంలో చేసే మంచి లేదా చెడు కర్మలు తదుపరి జన్మ రూపాన్ని నిర్ణయిస్తాయని కూడా ఈ గ్రంథం స్పష్టం చేస్తుంది.
ఆహ్వానించబడని అతిథులుగా వెళ్తే కాకి జన్మ
ఈగరుడ పురాణంలో కాకి పుట్టుకకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన నమ్మకం ఉంది. గరుడ పురాణం ప్రకారం ఆహ్వానం లేకుండా పదే పదే ఇతరుల ఇళ్లకు వెళ్ళేవారు, వివాహాలు లేదా విందులకు ఆహ్వానించబడకుండా హాజరయ్యే వారు వారి తదుపరి జీవితంలో కాకులుగా జన్మిస్తారు. అలాంటి వ్యక్తులు వారి తదుపరి జీవితంలో కాకిగా జన్మించి.. మీ ఇంటికి అతిథి రాబోతున్నాడని తమ అరుపులతో ప్రజలకు సంకేతాలు ఇస్తారని నమ్ముతారు. అందుకే ఇంటి పైకప్పు లేదా ఇంటి ఆవరణలో కాకి కూసినప్పుడు.. అతిథి రాబోతున్నాడని ప్రజలు అర్థం చేసుకుంటారు.
ఇవి కూడా చదవండి
పునర్జన్మ గురించి గరుడ పురాణం ప్రస్తావన
గరుడ పురాణం మరణం, పునర్జన్మను వివరించడమే కాదు జీవితంలో చేసే మంచి పనులు, క్రమశిక్షణ ప్రాముఖ్యతను కూడా బోధిస్తుంది. దీనిలో దాగి ఉన్న సందేశం ఏమిటంటే జీవితంలో చేసే కర్మలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కనుక మనం ఎల్లప్పుడూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సరైన పనులు చేయాలి. మంచి పనులు చేసేవారు మరణం తర్వాత వచ్చే జన్మలో మానవ శరీరాన్ని పొందుతారు. అలాంటి వారు వచ్చే జన్మలో కూడా దేవుడిని పూజిస్తారు, తద్వారా తదుపరి జన్మ మళ్ళీ మంచిగా లభిస్తుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.