తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతిని(ఆగస్టు 6) పురస్కరించుకొని ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని, ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గద్దర్ ఉన్నత కొలువుల వైపు దృష్టిసారించకుండా ప్రతి ఒక్కరికి కూడు, గూడు, నీడ లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపర్చారని ముఖ్యమంత్రి అన్నారు.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు గద్దర్ అని గుర్తు చేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని, పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని చెప్పారు. ఆయన చేసిన సాంస్కృతిక, సాహితీ సేవలకు గుర్తింపుగా జూన్ 14వ తేదీన గద్దర్ పేరిట తెలంగాణ ఫిల్మ్ అవార్డులను సినీ కళాకారులకు, సినీ ప్రముఖులకు అందించడం జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
గద్దర్ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, వారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది. తన పాటలతోనే తెలంగాణ ఉద్యమ పోరాటానికి ఊపిరి పోశారు ఆయన. జై బోలో తెలంగాణ సినిమాలోని ‘పొడుస్తున్న పొద్దు మీద’ అనే సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. తెలంగాణ ఉద్యమానికి ఈ పాట హైలెట్‌గా నిలిచింది. అలాగే అమ్మా తెలంగాణమా, భద్రం కొడుకో, మదనసుందరి, అడవి తల్లికి వందనం లాంటి అనేక పాటలు పాడారు. . నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు గద్దర్ నంది అవార్డుకు ఎంపిక అయ్యారు. అయినా కూడా దాన్ని ఆయన తిరస్కరించారు.
ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.