Friendship Day : ఆంధ్రాలోని ఆ ఊరిలో ‘ఫ్రెండ్ కాలనీ’.. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

Friendship Day : ఆంధ్రాలోని ఆ ఊరిలో ‘ఫ్రెండ్ కాలనీ’.. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?


కొన్ని ఊరు పేర్లు, కాలనీల పేర్లు వెనుక ఓ చరిత్ర ఉంటుంది. కొన్ని చోట్ల ఒకే ఇంటి పేరు గలవారు ఎక్కువగా నివసిస్తే ఆ గ్రామం లేదా ఆ వీధికి ఆ ఇంటి పేరుతోనే పిలవబడుతుంది. మరికొన్ని గ్రామాలు, వీధులకు దేవుడు పేర్లు లేదా జాతీయ నాయకుల పేర్లు పెట్టబడతాయి. మరికొన్ని గ్రామాల పేర్లయితే వినడానికి చాలా వింతగా, విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం జిల్లాలలో చాలా పేర్లు అలా కనిపిస్తూ ఉంటాయి. రూపాయి, శాసనం, దీపావళి, కడగండి, పుట్టుగ, బొమ్మాళి, కెల్ల, పులి పుట్టి వంటి పేర్లు అలాoటివే.

శ్రీకాకుళంలోని ఓ వీధి పేరు కూడా ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం అంటే అందరికీ గుర్తుండేది అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. ప్రపంచమంతా వాల్డ్ ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటోన్న వేల ఇపుడు అందరీ దృష్టి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆ వీధిపైనే పడింది. అందుకు కారణం ఆ వీధి పేరు ఫ్రెండ్స్ కాలనీ. ఫ్రండ్ అంటే ఒక తీయని బంధం, కష్ట సుఖాలలో తోడుగా ఉండే ఓ రిలేషన్. నమ్మకమైన స్నేహితుడు కోట గోడ వంటి వాడని, నిత్యం రక్షణగా ఉంటాడని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఫ్రెండ్ షిప్ అన్న సౌండింగ్ లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేరే ఈ వీధికి పెట్టడంతో ఇపుడు ఈ వీధి పేరు కూడా పాపులర్ అయింది. ఈ కాలని శ్రీకాకుళంలోని రామలక్ష్మణ జంక్షన్ నుండి పెదపాడుకు వెళ్ళే రోడ్ లో కుడి వైపుకు ఉంటుంది. కొత్తగా ఏర్పడిన కాలని ఇది. దీనికి పదేళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడిప్పుడే విస్తరిస్తుంది.

ఫ్రెండ్స్ కాలనీ అని పేరు ఎలా వచ్చింది అంటే….

కొత్తగా ఏర్పడిన కాలనీ ఏర్పడిన కాలంలో  పెద్దపాడు రోడ్‌లోని వీధి అని లేదా ఏదో ఒక ల్యాండ్ మార్క్ తో అడ్రస్ చెప్పేవారు. అయితే కాలని క్రమేపీ విస్తరించిన కొలది కాలానికి అంటూ ఒక పేరు అవసరం వచ్చింది. ఈ సందర్భంలోనే కొందరు యువకులు రియల్టర్స్‌గా మారి అదే వీధిలో ఒక లే అవుట్ వేశారు. దానికి ఏం పేరుతో రీజిస్ట్రేషన్ చేయించాలో తెలియక పార్టనర్స్ అందరూ స్నేహితులు కావడడంతో ఫ్రెండ్స్ కాలనీగా నామకరణం చేసి లే అవుట్ స్థలాల అమ్మకాలు ప్రారంభించారు. ఆనాడు తమ స్నేహానికి చిహ్నంగా ఉంటుందని మోడరన్‌గా ఉంటుందని భావించి.. తమ లే అవుట్‌కి ఫ్రెండ్స్ కాలనీ అని పేరు పెట్టారు. పేరు అందరికీ నచ్చడంతో తొందరగానే ఈ కాలని పేరు పాపులర్ అయింది. ఆ కాలనీలో మూడు వరుసలలో సుమారు 2 వందల వరకు నివాసాలు ఉన్నాయి. ఇపుడు ఈ ఫ్రెండ్స్ కాలనీ అంటే శ్రీకాకుళం నగరంలో తెలియని వారు లేరు. చివరకి ఫ్రెండ్స్ కాలనీ అన్న పేరు ఎంతగా పాపులర్ అయింది అంటే వాల్డ్ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా నగరంలోని యువత ఫ్రండ్స్ కాలానికి వచ్చి ఫ్రండ్స్ కాలనీ నేమ్ బోర్డు బ్యాక్ గ్రౌండ్‌లో సెల్ఫీలు తీసుకొని స్టేటస్‌లు పెట్టుకోవటం, తమ స్నేహితుల ఆ పిక్స్ తో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్‌లు పెట్టే స్థాయికి వరకు వెళ్ళింది. ఒకప్పుడు తమ ఇంటి అడ్రస్ సరిగ్గా చెప్పటానికి ఇబ్బంది పడ్డ కాలని వాసులు తమ వీధికి ఫ్రండ్స్ కాలనీగా పేరు పెట్టినప్పటి నుండి లెటర్స్, కొరియర్లు ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా నేరుగా తమ ఇళ్లకు చేరుకుంటున్నాయని కాలని వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *