Free NEET & EAPCET Coaching 2026: నిరుపేద విద్యార్ధులకు భలే ఛాన్స్.. ఉచితంగా నీట్, ఈఏపీసెట్‌ పరీక్షలకు కోచింగ్!

Free NEET & EAPCET Coaching 2026: నిరుపేద విద్యార్ధులకు భలే ఛాన్స్.. ఉచితంగా నీట్, ఈఏపీసెట్‌ పరీక్షలకు కోచింగ్!


అమరావతి, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుపేద విద్యార్ధులకు సర్కార్‌ శుభవార్త చెప్పింది. నీట్, ఈఏపీసెట్‌ పరీక్షలకు మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనుంది. ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సెంటర్‌ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ ద్వారా ఈ శిక్షణ అందించనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా మొత్తం 45 రోజులపాటు ఉచితంగా శిక్షణ అందిస్తామని వివరించారు. రాష్ట్రంలోని మైనార్జీ విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సీఈడీఎం అధికారిక వెబ్‌సైట్‌ www.apcedmmwd.orgల దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అలాగే ఫోన్‌ నంబర్‌ 0866- 2970567, మొబైల్‌ నంబర్‌ 7386789966ల ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఇతర వివరాలకు cedmap2017@gmail.com ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

కాగా నీట్ శిక్షణ తీసుకోవడానికి రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. అలాంటి శిక్షణను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు నీట్‌, ఈఏపీ సెట్‌ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణను మైనార్టీ సంక్షేమ శాఖ నేతృత్వంలో సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌ ద్వారా అందిస్తుంది. నీట్‌, ఈఏపీ సెట్‌ల పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. ఉచిత శిక్షణ కార్యక్రమంలో నిష్ణాతులైన అధ్యాపకులు బోధన అందిస్తారు. మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ రైల్వేలో 22,082 గ్రూప్ డి కొలువుల జాతర..

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న సుమారు 22,082 గ్రూప్ డి పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్ వంటి విభాగాల్లో పాయింట్స్‌ మ్యాన్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే (SCR) జోన్‌ పరిధిలో మొత్తం 1012 ఖాళీలు ఉన్నాయి. మార్చి 2, 226వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్ డి ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *