చికెన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం చాలా సులభం, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే. ఫ్రీజ్ చేసిన చికెన్‌ను సరిగ్గా వాడకపోతే కలిగే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం
ఫ్రోజెన్ చికెన్ వల్ల కలిగే ప్రమాదాలు
బ్యాక్టీరియా సమస్యలు:
పచ్చి చికెన్‌లో సాల్మోనెల్లా, క్యాంపిలోబ్యాక్టర్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. చికెన్‌ను సరిగ్గా డీఫ్రాస్ట్ చేయకుండా (కరిగించకుండా) వండినప్పుడు, ఈ బ్యాక్టీరియా పూర్తిగా చనిపోకపోవచ్చు. ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పోషకాలు తగ్గడం:
చికెన్‌ను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దానిలోని పోషకాలు, విటమిన్లు, ప్రొటీన్లు తగ్గుతాయి. ఇది చికెన్ రుచి, నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది.
రుచి, నాణ్యతలో తేడా:
చికెన్‌ను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచడం వల్ల దాని సహజమైన రుచి, మెత్తదనం తగ్గి, పొడిగా మారుతుంది.
ముఖ్యమైన చిట్కాలు:
ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద కాకుండా, ఫ్రిజ్ నుండి తీసి ఫ్రీజర్ నుండి కింద భాగంలో ఉంచి నెమ్మదిగా కరిగించడం సురక్షితమైన పద్ధతి.
చికెన్‌ను ఎప్పుడూ పూర్తిగా ఉడికించాలి. మాంసం లోపల గులాబీ రంగులో లేకుండా, పూర్తిగా తెల్లగా మారే వరకు వండాలి.
ఈ విషయాలు గుర్తుంచుకుంటే ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు.