ఫోక్ సింగర్ ప్రభ ఈ పేరు తెలియనివారుండరు. ఇటీవల ఆమె పాడిన ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. ఆమె పాట పాడిదంటే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. అంతగా తన గాత్రంతో యువతను ఊర్రూతలూగిస్తుంది ప్రభ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జానపద సంగీత ప్రస్థానం, ప్రముఖ పాటల, మరియు ఒక్కో పాటకు ఆమె తీసుకునే పారితోషికం గురించి చెప్పుకొచ్చారు. ఆమె తన సంగీత ప్రయాణంలో ఎదురైన ఆసక్తికరమైన విషయాలను, వ్యక్తిగత అనుభవాలను వెల్లడించారు. జానపద రంగంలోకి ఎలా వచ్చారు అని అడగగా, ప్రభ సై టీవీలో ప్రసారమయ్యే సింగర్ వెర్షన్ పాటలు చూసి స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. తాను కూడా అట్లా ఉండాలి, పాడాలి అనుకున్నా, కానీ మొదట్లో వెనకడుగు వేసి పాడటం మానేయాలనుకున్నానని చెప్పారు. ఆ సమయంలో తన భర్తనే తనను ప్రోత్సహించి ఈ రంగంలోకి తీసుకువచ్చారని ఆమె పేర్కొన్నారు. తాను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ ఊహించలేదని, ఓ పిల్లగా వెంకటి వంటి ఒక పాటతోనే ఈ గుర్తింపు వచ్చిందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
ప్రస్తుతం ఉన్నవారిలో తన తర్వాత మంగ్లీ వాయిస్ అంటే ఇష్టమని, ఆమెతో పరిచయం లేకపోయినా ఆమె పాడిన రేలారే రేలారే వంటి పాటలు చాలా ఇష్టమని ప్రభ వెల్లడించారు. సినిమా అవకాశాల గురించి ప్రస్తావించగా, ఒక స్పెషల్ సాంగ్ పాడినట్లు, అయితే అది ఇంకా విడుదల కాలేదని తెలిపారు. సుమారు ఒక సంవత్సరం క్రితం పాడిన ఈ పాట కాపీరైట్స్ సమస్యల వల్ల నిలిచిపోయిందని ఆమె అన్నారు. అయితే, మంచె దిగు, రింగు జుట్టు, కొమటల వెంకటి వంటి పాటలతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చిందని గుర్తుచేసుకున్నారు.. మంచె దిగు పాటకు రాజేందర్ కొండరాజు సాహిత్యం అందించగా, బొంతల పాటలోని కొన్ని పల్లవులు తాను సేకరించగా, మిగిలిన లిరిక్స్ ప్రసాద్ అన్న రాశారని ప్రభ వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
కొన్నిసార్లు ట్యూన్‌కు తగినట్టుగా వైఫ్-హస్బెండ్ కాన్సెప్ట్‌లు బాగుంటాయని, మరికొన్నిసార్లు మెలోడీగా ఉంటే వెంకటి తరహా పాటలు రాయించుకుంటామని చెప్పారు. కాన్సెప్ట్ బాలేకపోతే దాన్ని మార్చి కొత్త కాన్సెప్ట్‌తో పాటలు రాస్తామని, ఈ విషయంలో తన భర్తతో కలిసి చర్చిస్తామని అన్నారు. జానపద గీతాలైన గొలుసుకట్టు పాటలకు పల్లవి, చరణం వేర్వేరు ట్యూన్లు ఉండవని, మొత్తం ఒకే విధంగా ఉంటాయని వివరించారు. రెమ్యూనరేషన్ విషయానికొస్తే, తాను రాయడానికి , పాడటానికి వేర్వేరుగా పారితోషికం తీసుకుంటానని ప్రభ తెలిపారు. తాను పెద్ద లిరిసిస్ట్ కానందున ఎప్పుడూ డిమాండ్ చేయనని, కేవలం తన ప్రయాణ ఖర్చులు, పాడినందుకు ఇంత అని రిక్వెస్ట్‌గా మాట్లాడుతానని స్పష్టం చేశారు. సేకరించిన పాటలకు, సొంతంగా రాసిన పాటలకు వేర్వేరు పారితోషికం ఉంటుందని, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటారని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..