Fish Venkat: ఫిష్ వెంకట్‌ చికిత్సకు ప్రభాస్ ఆర్థిక సాయం! నటుడి భార్య ఏమన్నారంటే?

Fish Venkat: ఫిష్ వెంకట్‌ చికిత్సకు ప్రభాస్ ఆర్థిక సాయం! నటుడి భార్య ఏమన్నారంటే?


100కు పైగా సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్యంతో బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. రెండూ కిడ్నీలు చెడిపోవడంతో వెంటి లేటర్ పై అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అసలే ఆర్థిక సమస్యలు దీనికి తోడు ఫిష్ వెంకట్ ఆస్పత్రి పాలు కావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఫిష్ వెంకట్ కు ఆపరేషన్ చేసి కనీసం ఒక కిడ్నీ అయినా అమర్చాలని డాక్టర్లు చెబుతున్నారు. అతను బతకాలంటే ఇదొక్కటే మార్గమని తేల్చి చెప్పారు. అయితే ఇందుకు కనీసం రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ వద్ద అంత డబ్బు లేదని, సినీ ప్రముఖులు, దాతలు ఎవరైనా స్పందించి తమకు సాయం చేయాలని ఫిష్‌ వెంకట్‌ భార్య, కుమార్తె స్రవంతి కోరుతున్నారు. అయితే ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కు ప్రభాస్ టీమ్ నుంచి ఫోన్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమయ్యే రూ. 50 లక్షలను ఏర్పాటు చేస్తామని ప్రభాస్ అసిస్టెంట్ హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతినే చెప్పిందంటూ కొన్ని కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు.

ప్రభాస్ టీమ్ సాయం చేసినట్లు వస్తోన్న కథనాలపై ఫిష్ వెంకట్ భార్యను సంప్రదించగా తమకు ఎవరి దగ్గరి నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని క్లారిటీ ఇచ్చారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి అసలు బాగోలేదని కన్నీరుమున్నీరైంది. అంటే ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ టీమ్ హెల్ప్ చేస్తోందన్నది జస్ట్ రూమర్ మాత్రమే అని తేలిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *