Feeding Crows: కాకికి రోజూ అన్నం పెడుతున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి..

Feeding Crows: కాకికి రోజూ అన్నం పెడుతున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి..


కాకులకు రోజూ అన్నం పెట్టడం వల్ల ఇంట్లో మృత్యువు సంభవిస్తుందనే ఒక అపోహ సమాజంలో ప్రచారంలో ఉంది. ఈ విషయంపై అనేకమందిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రసిద్ధ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నందూరి శ్రీనివాస్ ఈ భయాలను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. కాకి ఎంతో అద్భుతమైన జీవి అని ఆయన పేర్కొన్నారు. ఇతర పక్షుల వలె కాకుండా, కాకి తన తోటి కాకులను కూడా ఆహారం పంచుకోవడానికి పిలుస్తుందని ఆయన వివరించారు. ఇటువంటి గొప్ప జీవికి ఆహారం అందించడం వలన భగవంతుడు ప్రసన్నుడవుతాడని నందూరి శ్రీనికవాస్ స్పష్టం చేశారు. కాకికి ఆహారం పెట్టడానికి మృత్యువుకు ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు.

శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు పితృదేవతలు కాకి రూపంలో వస్తారని మన పవిత్ర గ్రంథాలు చెబుతాయి. అలాంటి పితృదేవతలకు ఆహారం పెట్టడం ఎంతో మంచి కార్యం. కాబట్టి, కాకులకు హాయిగా రోజు ఆహారం పెట్టవచ్చు. ఈ చర్య భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. అనవసరమైన భయాలను మనసులో పెట్టుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.

నండూరి శ్రీనివాస్ యూట్యూబర్ కూడా. సుశీల నండూరి శ్రీనివాస్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు. భీమవరానికి చెందిన వీరు, సుమారు 25 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తూనే.. సనాతన ధర్మం, ఆలయ రహస్యాలు, పూజా విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిత్యజీవితంలో ఆచరించదగ్గ భక్తి మార్గాలను తన వీడియోల ద్వారా బోధిస్తారు.

స్పిరిచువల్‌గా కాకపోయినా నార్మల్‌గా ఆలోచించండి… ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినా ఇంత పుణ్యం వస్తుంది తప్పతే.. దోషం ఎందుకు అంటుకుంటుంది..? వెర్రి కాకపోతేనూ. నిరభ్యంతరంగా మూగ జీవాలను అన్నం పెట్టండి.. వారి మనుగడకు సాయపడండి…

Also Read: కాలువ నుంచి బరా.. బరా అని చప్పుళ్లు.. ఏంటా అని చూడగా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *