మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, అయిదు గ్రహాలు సొంత రాశిలో, ధన స్థానంలో సంచారం చేయడం వల్ల నెలంతా ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే, కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు విస్తరిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగి పోతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలుంటాయి.