FASTag Annual Pass: ఈ నెల 15 నుంచే ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ఆ వాహనాలకు నో ఛాన్స్..

FASTag Annual Pass: ఈ నెల 15 నుంచే ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ఆ వాహనాలకు నో ఛాన్స్..


నేషనల్ హైవేలపై జర్నీ చేయాలంటే టోల్ ఫీజు చెల్లించాల్సిందే. టోల్ ఫీజ్ కట్టకుండా జర్నీ చేయలేం. అయితే గతంలో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కేంద్రం ఫాస్టాగ్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఫాస్టాగ్ ఉంటే చాలు.. టోల్ గేట్ల దగ్గర ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం లేకుండా రయ్ మని వెళ్లొచ్చు. ఆ తర్వాత ఫాస్టాగ్ స్కీమ్‌లో ‌కేంద్రం ఎన్నో మార్పులు చేసింది. ఫాస్టాగ్ ఆన్యువల్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆగస్టు 15 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుత ఫాస్టాగ్ వ్యవస్థ మునుపటిలాగే కొనసాగుతుంది. అయితే పాస్ తీసుకునే ముందు మీరు దానికి అర్హులా..? కాదా అనే విషయం తెలుసుకోవాలి.

వార్షిక పాస్‌ ఎవరు తీసుకోలేరు..?

మీరు ఈ పాస్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్‌ను ఉపయోగించవచ్చు. కానీ మీ వాహనం VAHAN డేటాబేస్‌లో చెల్లుబాటులో ఉండాలి. ఫాస్టాగ్ స్టిక్కర్‌ను వాహనం యొక్క విండ్‌షీల్డ్‌పై అతికించాలి. వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ బ్లాక్‌లిస్ట్‌లో ఉండకూడదు వంటి కొన్ని షరతులు ఉన్నాయి. ఫాస్టాగ్‌లో ఛాసిస్ నంబర్ మాత్రమే నమోదు చేస్తే.. దానిపై వార్షిక పాస్ ఇవ్వరు. దీని కోసం మీరు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్‌డేట్ చేయించాలి.

ఎవరు అర్హులు..?

ఈ పాస్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్ వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే చెల్లుతుంది. ఫాస్టాగ్‌ను యాక్టివేట్ చేసే ముందు VAHAN డేటాబేస్‌తో కన్ఫార్మ్ చేసుకుంటారు. ఒకవేళ వాణిజ్య వాహనం ఈ పాస్‌ను ఉపయోగిస్తే.. అది ఎటువంటి నోటీసు లేకుండా వెంటనే రద్దు చేయబడుతుంది.

పాస్‌ను ఎక్కడెక్కడ వాడొచ్చు?

ఈ పాస్ జాతీయ రహదారి, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే యొక్క టోల్ ప్లాజాలలో మాత్రమే చెల్లుతుంది. మీరు రాష్ట్ర రహదారి లేదా స్థానిక సంస్థ నిర్వహించే ఎక్స్‌ప్రెస్‌వే టోల్‌లో దీనిని ఉపయోగించలేరు.

పాస్‌ను వేరేవారువాడొచ్చా?

లేదు. ఈ పాస్ ట్రాన్స్‌ఫర్ అవ్వదు. ట్యాగ్ అతికించిన వాహనానికి మాత్రమే చెల్లుతుంది. పాస్‌ను ఇతర వాహనంలో ఉపయోగిస్తే వెంటనే రద్దు చేస్తారు.

వార్షిక పాస్ ఎంతకాలం చెల్లుతుంది?

పేమెంట్ కట్టాక.. రెండు గంటల్లోపు పాస్ యాక్టివేట్ అవుతుంది. ఈ పాస్ ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు నేషనల్ హైవేలపై ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులు.. (ఏది ముందుగా పూర్తయితే అది) ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. పరిమితి చేరుకున్న తర్వాత.. పాస్ సాధారణ ఫాస్ట్‌ట్యాగ్‌గా మారుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *