కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత నగదుతో పాటు నెలనెలా పెన్షన్ వస్తుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్‌వో ద్వారా 58 ఏళ్ల తర్వాత నెలనెలా పెన్షన్ పొందవచ్చు. కానీ రైతులు వృద్దాప్యంలోకి వచ్చాక పని చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు రోజువారీ ఖర్చులకు నగదు లేక ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఉద్యోగుల తరహాలో రైతులకు కూడా వృద్దాప్యంలోకి చేరుకున్నాక పెన్షన్ సౌకర్యం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైతులు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొకూడదనే ఉద్దేశంతో కేంద్రం దీనిని తీసుకొచ్చింది. ఇందుకోసం ఓ పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. కానీ ఈ పథకం గురించి చాలామంది రైతులకు తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆ స్కీమ్ పేరే ప్రధానమంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన. అసలు ఈ పథకంలో ఎలా చేరాలి..? అర్హతలు ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు ఏంటంటే..?
-వయస్సు 18 నుంచి 40 సంత్సరాల మధ్య ఉండాలి
-ప్రభుత్వ భూ రికార్డుల్లో పేరు నమోదై ఉండాలి
-2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి
-చిన్న, సన్నకారుల రైతులు అయి ఉండాలి
వీరికి అర్హత లేదు
-ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్స్ అయిన ఈపీఎఫ్‌వో, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎస్‌ఐ, ఇతర చట్టబద్దమైన పెన్షన్ స్కీమ్స్‌లో ఉన్నవారు అనర్హులు
-ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్ధికంగా బలంగా ఉన్నవారు అనర్హులు
కావాల్సిన డాక్యుమెంట్స్
-పాస్‌పోర్ట్ సైజు ఫొటో
-ఆధార్ కార్డ్
-బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్
-ఇన్‌కమ్ సర్టిఫికేట్
-సాగు భూమి ధ్రువీకరణ పత్రం
-రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్
-ఇండి అడ్రస్ ప్రూఫ్
ఎలా చేరాలంటే..?
-సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్ లేదా మీ సేవ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు
-పీఎం కిసాన్ కేఎవై పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
-దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు పరిశీలించి నిర్ధారిస్తారు
-పీఎం కిసాన్ పథకంతో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రీమియం చెల్లించాలి
-40 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది
-60 ఏళ్ల తర్వాత నెలనెలా రూ.3 వేల పెన్షన్ పొందవచ్చు
-లబ్దిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ సొమ్ము అందుతుంది
-60 ఏళ్లు నిండిన తర్వాత మరణిస్తే జీవిత భాగస్వామికి సగం ఫించన్ వస్తుంది
-రైతులు స్వచ్చంధంగా ఈ పథకంలో చేరవచ్చు
-వయస్సును బట్టి ప్రీమియం ప్రతీ నెలా రూ.50 నుంచి రూ.220 వరకు ఉంటుంది
-మీరు ఎంత ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం అంత బీమా కంపెనీకి చెల్లిస్తుంది