టాటా మోటార్స్ ఇటీవల హారియర్ ఈవీకు సంబంధించిన రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ల ధరలను ప్రకటించింది. ఈ ధరలు రూ.21.49 లక్షల నుంచి రూ. 27.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. అలాగే టాటా మోటర్స్ హారియర్ ఈవీ గురించి మరిన్ని వివరాలను వెల్లడించారు, ముఖ్యంగా ఈ మోడల్‌కు సంబంధించిన వేరియంట్ వారీగా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. టాటా హారియర్ ఈవీ సింగిల్ మోటారుతో 65 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంటుంది. 75 కేడబ్ల్యూహెచ్ యూనిట్ ద్వారా డ్యూయల్ మోటార్ సెటప్‌తో క్వాడ్ వీల్ డ్రైవ్ అందుబాటులో ఉంది. అలాగే హారియర్ ఈవీ 65 ఆర్‌డబ్ల్యూడీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 538 కి.మీ.ల రేంజ్ ని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే హారియర్ ఈవీ 75 ఆర్‌డబ్ల్యూడీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 627 కి.మీ.ల రేంజ్ ని అందిస్తుంది. అయితే వాస్తవ పరిధి దీనికి భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవంగా హారియర్ ఈవీ 65 కేడబ్ల్యూహెచ్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ పై వాస్తవంగా 420 445 కిమీ పరిధిని అందిస్తుంది. 75 కేడబ్ల్యూహెచ్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ 480-505 కిమీ పరిధిని అందిస్తుంది. అలాగే 75 కేడబ్ల్యూహెచ్ క్యూడబ్ల్యూడీ వేరియంట్ పై 460-490 కిమీని పరిధిని అందిస్తుంది. టాటా హారియర్ ఈవీ బ్యాటరీ ప్యాక్ పై జీవితకాల వారంటీతో వస్తుంది (రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 సంవత్సరాలు). అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకు సంబంధించిన సెకండ్ ఓనర్స్ కూడా 10 సంవత్సరాల/200,000 కి.మీ వారంటీ ప్యాకేజీని పొందవచ్చు.
హారియర్ ఈవీ క్యూడబ్ల్యూడీ వేరియంట్లకు టాటా ఇంకా ధరలను ప్రకటించలేదు. భవిష్యత్‌లో ఈ వేరియంట్ ధర ప్రకటించే అవకాశం ఉంది. అయితే హారియర్ ఈవీలకు సంబంధించిన ఎక్స్-షోరూమ్ ధరలో ఛార్జర్, ఇన్స్టాలేషన్ ఖర్చు చేర్చలేదు. ఈ కారకు కంపెనీ 7.3 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌ను అందిస్తోంది. అలాగే ఇది 65 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి దాదాపు 9.3 గంటలు పడుతుంది. అదే సమయంలో 75 కేడబ్ల్యూహెచ్ 10 నుంచి 100 శాతం చార్జ్ చేయడానికి దాదాపు 10.7 గంటలు పడుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి