EPFO: పీఎఫ్ ఉన్నవారికి త్వరలో కేంద్రం నుంచి శుభవార్త..! ఇకపై నెలనెలా రూ.3 వేల పెన్షన్..!

EPFO: పీఎఫ్ ఉన్నవారికి త్వరలో కేంద్రం నుంచి శుభవార్త..! ఇకపై నెలనెలా రూ.3 వేల పెన్షన్..!


ఈపీఎఫ్‌వో పెన్షన్ పరిమితిని పెంచాలని మరోసారి కార్మిక సంఘలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ కనీస పెన్షన్ పరిమితి నెలకు రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని రూ.9 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు, పార్లమెంట్‌లో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. లోక్‌సభలో ఇటీవల ఎంపీ డాక్టర్ కిర్సన్ నామ్ డియో పీఎఫ్ ఖాతాదారులకు పెన్షన్ పెంపుపై ఉద్యోగ సంఘాలు కేంద్రాన్ని కోరాయా.. లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే సమాధానమిచ్చారు. కార్మిక సంఘాలతో పాటు ప్రజా ప్రతినిధుల నుంచి నెలకు రూ.వెయ్యి నుంచి పెంచాలని వినతులు వచ్చాయన్నారు. అయితే ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

నెలకు కనీసం రూ.వెయ్యి

పెన్షన్ స్కీమ్ అనేది కాంట్రిబ్యూషన్-ప్రయోజనం పథకం అని శోభా కరంద్లాజే తెలిపారు. వేతనాల్లో 8.33 శాతం యాజమాని సహకారం ఉంటే.. కేంద్ర ప్రభుత్వం 1.16 శాతం అదనంగా పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులకు ఇస్తుందని స్పష్టం చేశారు. దీంతో కనీసం నెలకు రూ.వెయ్యి పెన్షన్ అందుతుందన్నారు. ప్రస్తుతం 47,04,720 మంది శాశ్వాత పెన్షనర్లు నెలకు రూ.9 వేల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. దీంతో పెన్షన్ పరిమితి పెంచాలని ఉద్యోగ సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్లు గత కొద్ది కాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పీఎఫ్ కనీస వేతన పరిమితిని రూ.15 వేల నుంచి పెంచడంపై సమీక్షించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఒకవేళ బేసిక్ శాలరీ లిమిట్ పెరిగే పెన్షన్‌కు జమ అయ్యే సొమ్ము కూడా పెరుగుతుంది.

వేతన పరిమితి రూ.25 వేలకు పెరిగితే..

ఒకవేళ వేతన పరిమితి రూ.25 వేలకు పెంచితే నెలవారీ పెన్షన్ కూడా పెరుగుతోంది. 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తే నెలకు రూ.3570 అందుతుంది. ఇక 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినవారికి నెలకు రూ.12,500 అందుతుంది. దీంతో వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచినా 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వ్యక్తి రూ.9 వేల కంటే తక్కువే అందుతుంది. దీంతో కనీస శాలరీ లిమిట్‌ను రూ.25 నుంచి రూ.30 వేలకు పెంచడం వల్ల రూ.9 వేల కంటే తక్కువ పొందుతున్న 47 లక్షలకు పైగా పెన్షనర్లకు కాస్త అయినా ఊరట లభిస్తోంది. ఈపీఎఫ్‌పై బేసిక్ శాలరీ లిమిట్‌పై నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్రం ఆలోగా నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగులు ఆశిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *