EPFO: పీఎఫ్‌తో రూ.5కోట్లు.. మీ జీతంతో ఈ అద్భుతాన్ని ఎలా సృష్టించాలో మీకు తెలుసా..?

EPFO: పీఎఫ్‌తో రూ.5కోట్లు.. మీ జీతంతో ఈ అద్భుతాన్ని ఎలా సృష్టించాలో మీకు తెలుసా..?


ఉద్యోగికి పీఎఫ్ అనేది అత్యవసర సమయంలో ఆదుకునే బంగారు నిధి లాంటిది. ఉద్యోగి జీతం నుంచి కట్ చేసిన డబ్బుకు సమానంగా కంపెనీ కూడా పీఎఫ్‌ కడుతుంది. కష్టకాలంలో పీఎఫ్ ఎంతో ఉపయోగపడుతుంది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వంటి సౌకర్యాలను అందిస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 6నెలల తర్వాత నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీ జీతం రూ.50 వేలు అయితే.. మీరు పీఎఫ్ ద్వారా రూ.5కోట్లు అందుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పీఎఫ్ పథకం కింద.. ఉద్యోగులు, యజమానులు ఇద్దరూ ప్రతి నెలా ప్రాథమిక జీతంలో 12శాతం కంట్రిబ్యూషన్ చేస్తారు. ఎంప్లాయ్ జీతం నుండి కట్ అయిన 12శాతం పూర్తిగా మీ ఈపీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. యజమాని నుంచి జమ చేసింది మాత్రం భాగాలుగా విభజించారు. 8.33శాతం పెన్షన్‌కు, 3.67శాతం ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంది. దీనిపై వడ్డీ కూడా వస్తుంది.

PF పై వడ్డీ..

గతంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్‌పై వార్షిక వడ్డీని 8.15 శాతం అందించేది. దీనిని ఇప్పుడు ఆ శాఖ 8.25 శాతానికి పెంచింది.

ఇలా అయితే..

మీరు 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలో పనిచేస్తుంటే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఆ కంపెనీ పీఎఫ్ కడుతుంది. మీ జీతం నెలకు రూ. 50 వేలు అని అనుకుంటే.. మీరు 30 ఏళ్ల వయస్సులో కంపెనీలో జాయిన్ అయితే.. నిబంధనల ప్రకారం, కంపెనీ మీ జీతంలో 12 శాతం పీఎఫ్‌లో జమ చేస్తుంది. అంతే మొత్తాన్ని కంపెనీ కూడా జమ చేస్తుంది. దీంతో పాటు జీతం ఏటా 10 శాతం పెరిగితే, పదవీ విరమణ తర్వాత అంటే 58 ఏళ్ల తర్వాత 8.25 శాతం వడ్డీ ప్రకారం, మీ అకౌంట్‌లో రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. మీ మొత్తం నిధి రూ. 5,13,74,057 అవుతుంది. ఇలా పీఎఫ్ ద్వారా రూ.5 కోట్ల నిధిని జమ చేయవచ్చు.

ప్రభుత్వ బాండ్లు – సెక్యూరిటీలు:

కాగా పీఎఫ్ డబ్బును ఈపీఎఫ్‌వో తన వద్దే ఉంచుకోకుండా సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెడుతుంది. తన నిధులలో 15శాతం స్టాక్ మార్కెట్‌తో అనుసంధానించబడిన ETFలలో పెట్టుబడి పెడుతుంది. పెన్షన్, బీమా ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యజమాని EPSలో జమ చేసిన 8.33శాతం మీ పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్‌కు ఆధారం అవుతుంది. మీరు 10 ఏళ్లు EPF పథకానికి నిరంతరం డబ్బు కడుతుంటే, మీరు 58ఏళ్ల తర్వాత పెన్షన్ పొందుతారు. దీనితో పాటు EDLI పథకం కింద, ఉద్యోగి అకాల మరణంపై కుటుంబానికి బీమా ప్రయోజనం కూడా లభిస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *