Eggs: అబ్బబ్బ.! ప్రతీరోజూ 4 గుడ్లు తిన్నారనుకోండి.. ఇకపై

Eggs: అబ్బబ్బ.! ప్రతీరోజూ 4 గుడ్లు తిన్నారనుకోండి.. ఇకపై


Eggs: అబ్బబ్బ.! ప్రతీరోజూ 4 గుడ్లు తిన్నారనుకోండి.. ఇకపై

ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వివరించారు. ఫ్యాటీ లివర్ సమస్య నివారణకు వెజిటేరియన్ డైట్ మంచిదని, అయితే ఇడ్లీ, పాలిష్డ్ రైస్ లాంటి కార్బోహైడ్రేట్లు సమస్యను పెంచుతాయని తెలిపారు. మిల్లెట్స్ మేలు చేస్తాయి. నాన్-వెజిటేరియన్‌లో ఫిష్, గుడ్లు ఫ్యాటీ లివర్‌కు తక్కువ కారణమని, రెడ్ మీట్ అస్సలు ముట్టుకోవద్దన్నారు. గుడ్ల విషయానికి వస్తే, పచ్చసొనలో కొలిన్(ఫ్యాటీ లివర్‌ను నివారిస్తుంది), కండరాలను రక్షించే పదార్థాలు ఉన్నందున, రోజుకు నాలుగు పచ్చసొనలు తినడం వల్ల ఎలాంటి హాని లేదన్నారు. సగటున 70 కిలోల వ్యక్తికి రోజుకు 70 గ్రాముల ప్రొటీన్ అవసరం. పప్పులు, మొలకలు, బీన్స్, ఫిష్, చికెన్, యోగర్ట్ మంచి ప్రొటీన్ వనరులు.

ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని డాక్టర్ గట్టిగా సూచించారు. అధిక కార్బోహైడ్రేట్లు, సోడియం, ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ వల్ల గట్ మైక్రోబయోమ్ దెబ్బతిని, లివర్ డ్యామేజ్ అవుతుందన్నారు. ముఖ్యంగా పిల్లలకు ప్రాసెస్డ్ ఫుడ్ అలవాటు చేయరాదని, పాఠశాలల పరిసరాల్లో ఫాస్ట్ ఫుడ్‌ను నిషేధించాలని పిలుపునిచ్చారు. 150 నిమిషాల మోడరేట్ వ్యాయామం వారానికి తప్పనిసరి అని తెలిపారు. ఆర్గానిక్ ఆహారం, తాజా కూరగాయలు, బెర్రీలు, బ్రకోలీ, బీట్రూట్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా గట్ ఆరోగ్యాన్ని మంచిగా ఉంటాయన్నారు.

సప్లిమెంట్లు, కలుషిత ఆహారం

విటమిన్ డీ, బీ12, ఫోలిక్ యాసిడ్ వంటి కొన్ని సప్లిమెంట్లు హానికరం కాదని, ముఖ్యంగా వెజిటేరియన్లకు బి12, ఫోలిక్ యాసిడ్ లోపాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. సహజమైన, పౌష్టికాహారం తీసుకుంటే సప్లిమెంట్ల అవసరం పెద్దగా ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే కూరగాయలు, పాలు, గుడ్లు, పండ్లలో కలుషితాలు, పురుగుమందులు అధికంగా ఉన్నాయని, ఇది సమాజం ఎదుర్కొంటున్న పెద్ద సవాలు అని, ఆర్గానిక్ ఆహారం వైపు మళ్లడం కష్టమైనప్పటికీ, దాని ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *