Egg Yolk Myth: పచ్చసొనను పారేస్తున్నారా? మీరు చేసే అతిపెద్ద తప్పు ఇదే! షాకింగ్ హెల్త్ సీక్రెట్!

Egg Yolk Myth: పచ్చసొనను పారేస్తున్నారా? మీరు చేసే అతిపెద్ద తప్పు ఇదే! షాకింగ్ హెల్త్ సీక్రెట్!


Egg Yolk Myth: పచ్చసొనను పారేస్తున్నారా? మీరు చేసే అతిపెద్ద తప్పు ఇదే! షాకింగ్ హెల్త్ సీక్రెట్!

నిజానికి మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌లో దాదాపు 85% మన కాలేయమే (Liver) సొంతంగా తయారు చేసుకుంటుంది. మనం తినే ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ ప్రభావం చాలా తక్కువ. గుడ్డు పచ్చసొనలో విటమిన్ A, విటమిన్ E ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కేవలం ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉందని, పచ్చసొనతో కలిపి తీసుకున్నప్పుడే అది పూర్తి స్థాయి పోషకాహారంగా మారుతుందని డాక్టర్ ఆలోక్ వివరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కొలెస్ట్రాల్ వెనుక అసలు కథ

కొలెస్ట్రాల్ అనగానే అది చెడ్డదని మనం భావిస్తాం, కానీ హార్మోన్ల ఉత్పత్తికి, మెదడు పనితీరుకు రోగనిరోధక శక్తికి ఇది ఎంతో అవసరం. గుడ్డులోని కొలెస్ట్రాల్ వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మనం ఆహారం ద్వారా కొలెస్ట్రాల్ తీసుకున్నప్పుడు, శరీరం తన సొంత తయారీని తగ్గించుకుని సమతుల్యం చేస్తుంది. ఒకవేళ కొలెస్ట్రాల్ పెరిగినా, అది హెచ్‌డీఎల్ (HDL) అనే ‘మంచి కొలెస్ట్రాల్‌’నే పెంచుతుంది, ఇది గుండెకు రక్షణగా నిలుస్తుంది.

ముప్పు ఎక్కడ ఉంది?

గుండెకు హాని కలిగించేది గుడ్డులోని కొలెస్ట్రాల్ కాదు.. మనం తినే ట్రాన్స్ ఫ్యాట్స్ అధిక సాచురేటెడ్ ఫ్యాట్స్. సరైన వ్యాయామం లేకపోవడం, ధూమపానం మరియు జన్యుపరమైన కారణాలే హానికరమైన ఎల్‌డీఎల్ పెరగడానికి ప్రధాన కారణం. కాబట్టి, సమతుల్య ఆహారంలో భాగంగా గుడ్డును పూర్తిగా తీసుకోవడం వల్ల ఎటువంటి ముప్పు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Alok Chopra (@dralokchopra)

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

అందరికీ ఇది వర్తించదు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు, డయాబెటిస్ బాధితులు గౌట్ సమస్య ఉన్నవారు పచ్చసొన విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే ‘హైపర్-రెస్పాండర్స్’ (ఆహారం ద్వారా కొలెస్ట్రాల్ త్వరగా పెరిగే వారు) కూడా పచ్చసొన వినియోగాన్ని పరిమితం చేసుకోవడం మంచిది. ఆరోగ్యవంతులు మాత్రం రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లను పచ్చసొనతో సహా నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ డైట్‌లో మార్పులు చేసే ముందు డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *